సమంత ఈ చిన్న దాని గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఏ మాయ చేసావే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ చిన్నది అతి తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. అతి తక్కువ సమయంలోనే సమంత స్టార్ హీరోయిన్ గా సక్సెస్ అందుకుంది. ఏ మాయ చేసావే సినిమాలో మొదటిసారిగా నాగచైతన్యతో జత కట్టింది. ఆ సినిమా సమయంలోనే ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. చాలా కాలం పాటు ప్రేమించుకున్న ఈ జంట కుటుంబ సభ్యుల సమక్షంలో అంగరంగ వైభవంగా వివాహాన్ని జరుపుకున్నారు.

 కేవలం నాలుగు సంవత్సరాల పాటు కలిసి ఉన్న సమంత, చైతు మనస్పర్ధల కారణంగా విడాకులు తీసుకున్నారు. విడాకులు అనంతరం సమంత మయోసైటిస్ వ్యాధి బారిన పడిన సంగతి తెలిసిందే. ఆ వ్యాధి నుంచి కోలుకోవడానికి ఈ చిన్న దానికి చాలా సమయం పట్టింది. మయోసైటిస్ వ్యాధి రావడంతో సమంత అనేక రకాల ఇబ్బందులను ఎదుర్కొంది. అమెరికాకు సైతం వెళ్లి చికిత్స తీసుకుంది. ఆ సమయంలో సమంతకు చాలామంది సినీ సెలబ్రిటీలు కుటుంబ సభ్యులు అండగా నిలిచారు. ఈ క్రమంలోనే సమంతకు నటి ఆలియా భట్ చాలా సపోర్ట్ గా ఉన్నారట.

వీరిద్దరూ చాలా మంచి స్నేహితులు. ఆ స్నేహం కారణంగానే ఆలియా సమంతకు చాలా ధైర్యం చెప్పారట. తన ఆరోగ్య విషయాలను దగ్గర ఉండి మరీ తెలుసుకున్నారట. ఇక సమంత చాలా మంచి యాక్టర్ అని గొప్ప మనసు ఉన్న వ్యక్తి అంటూ ఆలియా వెల్లడించారు. ప్రస్తుతం అలియా భట్, సమంతకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఇక సమంత మయోసైటిస్ వ్యాధి నుంచి కోలుకున్న అనంతరం వేగంగా సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం ఈ బ్యూటీ బాలీవుడ్ లో సైతం నటిస్తోంది. సక్సెస్ఫుల్ హీరోయిన్ గా తన కెరీర్ కొనసాగిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: