టాలీవుడ్ హీరో నితిన్ కు ఈ మధ్య కాలంలో లక్ కలిసిరావడం లేదు. సక్సెస్ ట్రాక్ లో ఉన్న దర్శకుల డైరెక్షన్ లో నటిస్తున్నా నితిన్ కోరుకున్న భారీ సక్సెస్ అయితే దక్కడం లేదని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఏడాది నితిన్ నటించి విడుదలైన రాబిన్ హుడ్ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకునే విషయంలో ఫెయిలైంది. ఈ సినిమా నిర్మాతలకు సైతం భారీ నష్టాలను మిగిల్చింది.
 
అయితే వరుస ఫ్లాపుల వల్ల నితిన్ కు కొత్త కష్టాలు ఎదురవుతున్నాయని తెలుస్తోంది. నితిన్ భవిష్యత్తు సినిమాలకు సరైన హీరోయిన్లు దొరకడం లేదని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. నితిన్ బలగం వేణు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాకు హీరోయిన్ ను ఎంపిక చేయడం ఒకింత సవాలుగా మారిందని తెలుస్తోంది. పూజా హెగ్డే పేరు ఈ సినిమా కోసం పరిశీలనలో ఉందని భోగట్టా.
 
రెట్రో సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్ గా నిలిస్తే పూజా హెగ్డే పేరు ఈ సినిమాలో ఫిక్స్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. నితిన్ రెమ్యునరేషన్ సైతం గతంతో పొలిస్తే తగ్గిందని భోగట్టా. భవిష్యత్తు సినిమాలతో నితిన్ ఏ రేంజ్ హిట్లను అందుకుంటారో చూడాల్సి ఉంది. నితిన్ కొత్త సినిమాకు సంబంధించి త్వరలో పూర్తిస్థాయిలో క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి.
 
నితిన్ కు హిట్ అందించే డైరెక్టర్ ఎవరనే చర్చ సైతం సోషల్ మీడియా వేదికగా జరుగుతోంది. నితిన్ ను అభిమానించే ఫ్యాన్స్ సైతం ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. నితిన్ ఎంచుకునే కథలలో వైవిధ్యం చూపిస్తూనే మరిన్ని భారీ విజయాలను అందుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉందని చెప్పవచ్చు. నితిన్ కెరీర్ ప్లాన్స్ ఏ విధంగా ఉంటాయో చూడాలి. స్టార్ హీరో నితిన్ నెక్స్ట్ లెవెల్ విజయాలను అందుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.




మరింత సమాచారం తెలుసుకోండి: