నాచురల్ స్టార్ నాని తాజాగా నటించిన హిట్ 3 సినిమా ఈ రోజున ప్రేక్షకుల ముందుకి వచ్చింది. హీరోయిన్ల శ్రీనిధి శెట్టి నటించగా.. డైరెక్టర్ శైలేష్ కొలను ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. హిట్ ఫ్రాంచైజీలో భాగంగా హిట్, హీట్ 2, చిత్రాలు వచ్చాయి. ఇప్పుడు తాజాగా హిట్ 3 సినిమా హీరో నాని అర్జున్ సర్కార్ అని పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించారు. మొదటి భాగంలో విశ్వక్ సేన్, రెండో భాగంలో అడవి శేషు.. థర్డ్ కేసులో నాని ఎంట్రీ ఇచ్చారు. ట్రైలర్లో చూపించిన యాక్షన్ సన్నివేశాలు హైలెట్ గా నిలిచాయి. ఈసారి వైలెన్స్ మరింత ఎక్కువగా ఉండబోతుందని చూపించారు.


ట్విట్టర్ వేదికగా హిట్ 3 సినిమా గురించి ఆడియన్స్ తమ రెస్పాన్స్ ని తెలియజేస్తున్నారు. మొదట ఈ సినిమా కోర్టు సన్నివేశంతో మొదలవుతుందని హీరోయిన్ శ్రీనిధి శెట్టి, నాని మధ్య కెమిస్ట్రీ కూడా బాగా వర్క్ అవుట్ అయిందని తెలుపుతున్నారు. ప్రి ఇంటర్వెల్ ముందు వరకు కథ నెమ్మదిగానే సాగుతుందని కానీ అక్కడి నుంచి ఒక్కసారిగా వేగంగా కథ ముందుకు వెళుతుందని తెలుపుతున్నారు. ఇంటర్వెల్ సన్నివేశం చాలా ఉత్కంఠంగా అనిపిస్తుందని.. ట్రైలర్లు చూపించినట్లుగానే వైలెన్స్ చాలా ఎక్కువగా ఉందని తెలిపారు.


అలాగే హీరో నాని కొన్ని బోల్డ్ డైలాగులు కూడా ఇందులో ఉపయోగించారని నాని క్యారెక్టర్ చాలా డిఫరెంట్ గా ఉన్నదని తన కెరియర్ లోనే ఇలాంటి పాత్రలో మొదటిసారి కనిపించారని తెలియజేస్తున్నారు ఆడియస్స్. మొదటి భాగం యావరేజ్ గా ఉందని సెకండ్ హాఫ్ లో నాని కెరియర్ లోని అద్భుతమైన యాక్టింగ్ చేశారని తెలుపుతున్నారు. సెకండాఫ్ లో చాలా సన్నివేశాలు ఎగ్జైటింగ్ గా అయ్యేలా చేస్తాయని.. సినిమా చివరి 30 నిమిషాలు హైలెట్ గా ఉందని తెలుపుతున్నారు. నాని నటన సెకండ్ హాఫ్ లో వచ్చే సన్నివేశాలు ఈ సినిమాని నిలబెట్టాయి.


ఈ చిత్రంలోని వైలెన్స్ చిన్నపిల్లలు మహిళలు సైతం చూడలేరు.. అయితే ఈ చిత్రంలో ఎలాంటి ట్విస్టులు కూడా లేవట. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా ఆశించిన స్థాయిలో లేదట. పాటలు కూడా ఆకట్టుకోలేదు. పూర్తి రివ్యూ తెలియాలి అంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే

మరింత సమాచారం తెలుసుకోండి: