ఎంత పెద్ద హీరో కైనా కొన్ని కొన్ని తిప్పలు తప్పవు . అది పాన్ ఇండియా స్టార్స్ అయినా కూడా.. మరీ ముఖ్యంగా ఇప్పుడు రామ్ చరణ్ పరిస్థితి ఎలా ఉందో అందరికీ తెలిసిందే. రాంచరణ్ అంటే ఒక పెద్ద బడాస్టార్ . పాన్ ఇండియా  స్టార్ . 100 కోట్లు అందుకునే ఒక తోపైనా యాక్టర్ . ఇలానే మాట్లాడుకునే వాళ్ళు జనాలు . అదంతా గేమ్ ఛేంజ్జర్ సినిమా రిలీజ్ అవ్వకముందు . గేమ్ ఛేంజర్ సినిమా రిలీజ్ అయిన తర్వాత పరిస్థితి మొత్తం పూర్తిగా తారు మారు అయిపోయింది . గేమ్ చేంజర్  సినిమా ఫ్లాప్ అవ్వడంతో 100 కోట్ల హీరోకి కూడా ఈ గతి  పట్టింది ఏంటి..? అంటూ జనాలు మాట్లాడుకోవడం ప్రారంభించారు .


కొంతమంది జనాలు కూసింత  ముందు స్టెప్ వేసి సినిమాపై నెగిటివ్ గా మాట్లాడడమే కాకుండా రామ్ చరణ్ పర్సనల్ లైఫ్ ని కూడా ట్రోల్ చేస్తూ వచ్చారు . అయితే గతంలో చరణ్ లైఫ్ బాగా సెటిల్ అవ్వాలి అంటూ చిరంజీవి తనకి ఇష్టం లేకపోయినా సరే మగధీర సినిమాలో రామ్ చరణ్ తో కొంచెం టైం స్క్రీన్ షేర్ చేసుకుని సినిమాకి భారీ హైప్ ఇచ్చారు. ఆ టైంలో చిరంజీవి పొలిటికల్ ఎంట్రీ పై .. పొలిటికల్ పార్టీ విలీనంపై ఎంతలా రాద్ధాంతం జరుగుతోందో అందరికీ తెలిసిందే.

 

అయితే ఇప్పుడు చరణ్ హిట్ కొట్టడానికి పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తున్నారట.  సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ ఓ సినిమాలో నటించబోతున్నాడు అన్న విషయం అందరికీ తెలుసు . ఈ సినిమా కోసం స్వయంగా రంగంలోకి దిగబోతున్నాడట పవన్ కళ్యాణ్ . ఈ సినిమాలో రెండు అంటే రెండు నిమిషాలు కనిపించే పాత్ర కోసం పవన్ కళ్యాణ్ ఓకే చేశారట . నిజానికి పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం గా మారిన తర్వాత కొత్త మూవీస్ ని ఓకే చేయలేదు . కానీ చరణ్ లైఫ్ లో సెటిల్ అవ్వడం కోసం ఫ్లాప్ టాక్ నుంచి బయట పడటం కోసం ఇలా పవన్ కళ్యాణ్ ఈ నిర్ణయం తీసుకున్నారట . ఇదే న్యూస్ ఇప్పుడు బాగా వైరల్ గా మారింది..!

మరింత సమాచారం తెలుసుకోండి: