
న్యాచురల్ స్టార్ నాని, టాలెంటెడ్ డైరెక్టర్ శైలేష్ కొలను కాంబినేషన్ లో తెరకెక్కిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ ` హిట్: ది థర్డ్ కేస్`. ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా యాక్ట్ చేయగా.. సూర్య శ్రీనివాస్, రావు రమేష్, సముద్రఖని, కోమలి ప్రసాద్, నెపోలియన్ తదితరులు ఇతర ముఖ్యమైన పాత్రలను పోషించారు. అడవి శేష్ గెస్ట్ రోల్ ను ప్లే చేశాడు. నాని సొంత బ్యానర్ లో నిర్మితమైన హిట్ 3 చిత్రం మే 1న విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతోంది.
విడుదలైన ఐదు రోజుల్లో ఆల్మోస్ట్ బ్రేక్ ఈవెన్ కు చేరువైన హిట్ 3.. ఫుల్ రన్ లో గణనీయమైన లాభాలను అందుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ సంగతి పక్కన పెడితే.. హిట్ 3 సెకండాఫ్ లో సైకో కిల్లర్స్ గ్యాండ్ లో నానితో పాటు ఓ అమ్మాయి కనిపిస్తుంది. సూపర్ క్యూట్ గా ఉండే ఆ అమ్మాయికి, నాని మధ్య ఫైట్ సీన్స్ కూటా ఉంటాయి. నాని ఎనర్జీకి ఏమాత్రం తీసిపోకుండా యాక్షన్ సన్నివేశాల్లో చెలరేగిపోయిన ఆ అమ్మాయికి ఫిదా అయిపోయారు సినీ లవర్స్.
ఇంకేముందు ఆ అమ్మాయిని గూగుల్ లో, సోషల్ మీడియాలో వెతకడం షురూ చేశారు. ఫైనల్ గా ఆమె ఇన్‌స్టా అకౌంట్ ను పట్టేసి ఫాలో కొట్టడం స్టార్ట్ చేశారు. దాంతో గత మూడు, నాలుగు రోజుల్లోనే ఆమె ఇన్‌స్టా ఫాలోవర్స్ సంఖ్య భారీగా పెరుగుతూ వచ్చింది. ఆమె డీటైల్స్ విషయానికి వస్తే.. తన పేరు నిధి సింగ్. ముంబైలో ఉంటున్న ఈ బ్యూటీ మోడల్ గా రాణిస్తోంది. ఇప్పటికే పలు యాడ్స్ లో యాక్ట్ చేసింది. తెలుగులో హిట్ 3నే ఆమె మొదటి సినిమా. అయితే ఈ చిత్రంతో ఆమె జాతకమే మారిపోయింది.
హిట్ 3 ముందు వరకు నిధి సింగ్ అంటే ఎవరో కూడా తెలియదు. కానీ ఇప్పుడు ఆమె ఫాలోవర్స్ సంఖ్య అమాంతం పెరుగుతోంది. తెలుగులో మరిన్ని అవకాశాలు కూడా తలుపుతున్నాడు. మొత్తంగా ఒక్క సినిమాకే తెలుగు ప్రేక్షకులు తన పట్ల చూపుతున్న ప్రేమాభిమానాలు చూసి నిధి సింగ్ తెగ సంబరపడిపోతోంది. మరి భవిష్యత్తులో ఈమె ఎటువంటి అవకాశాలు దక్కించుకోనుందో చూడాలి.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు