సమంత రాజ్ నిడిమోరు డేటింగ్ రూమర్లు రోజురోజుకు శ్రుతి మించి పోతున్నాయి. అయితే సమంత రెండో పెళ్లి వార్తలపై డేటింగ్ రూమర్లపై ఎన్ని గాసిప్స్ వినిపించినా కూడా ఎక్కడా కూడా స్పందించి నాకు ఆయనతో ఎలాంటి సంబంధం లేదు అని చెప్పడం లేదు అంటే వారిద్దరి మధ్య ఏదో సంథింగ్ ఉంటేనే సమంత వాటిపై స్పందించడానికి ఇష్టపడడం లేదని,ఒకవేళ స్పందిస్తే ఆ వార్తలు ఇంకా ఎక్కువ అవుతాయని అనుకుంటుంది కావచ్చు అని పలువురు నెటిజెన్లు భావిస్తున్నారు. అంతేకాదు సమంత ఇన్ని రూమర్లు వినిపించినా కూడా ఆయనతో తిరగడం మానడం లేదు.కొంతమంది సెలబ్రిటీలు ఎవరితోనైనా తిరిగితే వారితో ఏదో సంబంధం ఉంది అంటూ  వార్తలు వినిపిస్తే వారితో బంధాన్ని కట్ చేసుకుంటారు.. లేదా వారి మధ్య ఏదైనా రిలేషన్ ఉంటే అలాగే కొనసాగిస్తారు.ఇకమరి కొంత మంది ఏమో సీక్రెట్ గా కలుసుకుంటారు.

 కానీ సమంత మాత్రం బహిరంగంగానే రాజ్ నిడిమోరు తో చట్టాపట్టాలేసుకొని తిరుగుతుంది. పికిల్ బాల్ కాంపిటీషన్ అయినా కొత్త సినిమా ప్రారంభోత్సవమైనా.. ప్రమోషన్స్ అయినా.. ఏదైనా సరే సమంత వెంటే రాజ్ నిడిమోరు కూడా ఉంటున్నారు. అయితే తాజాగా సమంత నిర్మాతగా మారి తీస్తున్న మొదటి మూవీ శుభం.ఈ సినిమా మరికొద్ది గంటల్లో విడుదలకు సిద్ధంగా ఉన్న నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్ లో బిజీ అయిపోయిన సమంత ఓవైపు ప్రత్యక్ష ఇంటర్వ్యూలు ఇస్తూనే మరోవైపు సోషల్ మీడియా వేదికగా కూడా తన సినిమాని ప్రమోట్ చేసుకుంటుంది.అలా తాజాగా సమంత తన సోషల్ మీడియా ఖాతాలో శుభం సినిమా గురించి ప్రమోషన్స్ చేసుకోవడమే కాకుండా తనకి సంబంధించిన కొన్ని స్టైలిష్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. 

అంతేకాకుండా తన పెట్ డాగ్ తో కలిసి ఉన్న ఫోటోలను అలాగే రాజ్ నిడిమోరుతో ఉన్న ఫోటోను కూడా నెట్టింట్లో వైరల్ చేయడంతో పాటు తన శుభం మూవీకి సంబంధించి షూటింగ్ పిక్స్ ని కూడా షేర్ చేసింది.అలాగే శుభం మూవీలోని పాటకు డాన్స్ చేస్తున్న వీడియో కూడా పోస్ట్ చేసింది. అంతేకాకుండా ఇది చాలా పెద్ద మార్గం.ఈ మార్గంలో మేము ఉన్నాము.. కొత్త ప్రారంభం అంటూ హార్ట్ సింబల్స్ షేర్ చేస్తూ పోస్ట్ చేసింది.దీంతో చాలామంది నెటిజన్లు రాజ్ నిడిమోరుతో సమంత కొత్త జీవితం ప్రారంభించబోతుంది కావచ్చు అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక మరికొంత మందేమో సమంత నిర్మాతగా ఫస్ట్ సినిమా కాబట్టి న్యూ బిగినింగ్స్ అని పోస్ట్ చేసిందని కామెంట్లు పెడుతున్నారు. ఏది ఏమైనప్పటికీ సమంత రాజ్ నిడిమోరుల డేటింగ్ వార్తలు రోజు రోజుకి ఎక్కువై పోతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: