జయం రవి తాజాగా ఓ పెళ్లిలో తన రూమర్డ్ ప్రియురాలు అయినటువంటి సింగర్ కెనీషా ఫ్రాన్సిస్ తో కలిసి జంటగా హాజరైన సంగతి మనకు తెలిసిందే.ఇక వీరిద్దరూ జంటగా కనిపించడంతో మరోసారి కోలీవుడ్ లో వీరి పెళ్లికి సంబంధించిన ఊహాగానాలు చక్కర్లు కొట్టాయి.అయితే ఈ ఫోటో క్షణాల్లోనే సోషల్ మీడియా మొత్తం వైరల్ అవ్వడంతో ఇది చూసిన జయం రవి భార్య ఆర్తి సోషల్ మీడియాలో సంచలన పోస్ట్ చేసింది. నా పిల్లల్ని పట్టించుకోవడంలేదని, నాకు ఇంకా విడాకులు రాలేదని, విడాకులు వచ్చేవరకు నేను ఆర్తి రవి గానే ఉంటానని,18 సంవత్సరాలు నాతో కలిసి ఉన్న వ్యక్తి నన్ను ఇంట్లో నుండి గెంటేసాడని, పిల్లలను కూడా పట్టించుకోకుండా వారికి అవసరాలకు కావలసిన డబ్బు కూడా ఇవ్వడం లేదని, ఇద్దరం కలిసికట్టుకున్న ఇల్లు విషయంలో ఇప్పుడు బ్యాంకు నుండి సమస్య వచ్చిందని, కానీ నేను డబ్బు కోసం కాదు మనిషి కోసం వ్యాల్యూ ఇస్తున్నానని, ఇంకా మౌనంగా ఉండలేను. 

నా పిల్లల కోసం బలంగా నిలబడతాను అంటూ ఓ పెద్ద పోస్ట్ చేసిన సంగతి మనకు తెలిసిందే. అంతే కాదు ఈరోజు కనిపించిన ఫోటోని అందరూ చూశారు అంటూ కూడా పరోక్షంగా జయం రవి సింగర్ కెనీషా ల వ్యవహారం బాగోతం బయటపెట్టింది.అయితే తాజాగా ఆర్తి పెట్టిన పోస్ట్ కి కౌంటర్ ఇచ్చింది జయం రవి ప్రియురాలుగా చెప్పుకుంటున్న సింగర్ కెనీషా. ఆమె తన సోషల్ మీడియా ఖాతాలో ఈ విధంగా పోస్ట్ చేసింది.ఒక మగాడు ఎవరికి లొంగిపోడు.. ఎమోషన్స్ కి అస్సలు లొంగడు. కానీ ఒక మగాడికి ఏ మహిళతో అయితే ఆనందం ఉంటుందో ఆ మహిళ దగ్గరే ఉంటాడు.ఆ మహిళకే మనసు ఇస్తాడు.

మౌనంగా ఉంటున్నాను కదా అని నన్ను లైట్ తీసుకోకు..నా మౌనమే నా బలం అంటూ ఆర్తి కి పరోక్షంగా కొటేషన్ తో  కౌంటర్  ఇచ్చింది.దీంతో సింగర్ కెనీషా పెట్టిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారడంతో ఆర్తి దగ్గర ప్రశాంతత లేకపోవడం వల్లే కెనిషా కి జయం రవి దగ్గరై ఆమెకు మనసిచ్చాడని పూర్తిగా అర్థమవుతుంది అంటూ నెటిజెన్లు కామెంట్లు పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: