సీనియ‌ర్ ఎన్టీఆర్ ఇద్దరమ్మల ముద్దుల కొడుకు. తల్లి వెంకట్రావమ్మ, పెదతల్లి చంద్రమ్మలు అక్కా చెల్లెళ్ళు. పిల్లలు  లేకపోవడంతో ఎన్టీఆర్ పుట్టగానే ఆయనను చంద్రమ్మగారే సాకడం మొదలు పెట్టారు. తమ్ముడు త్రివిక్రమరావు తల్లి దండ్రుల వద్ద పెరుగగా, ఎన్టీఆర్ పెద్దమ్మ, పెదనాన్నల దగ్గర పెరిగారు. తారకరాముడు అన్న పేరు కూడా పెదనాన్న రామయ్య పెట్టిన పేరే .. కానీ తల్లి వెంకట్రావమ్మకు మాత్రం ఎన్టీఆర్ కు కృష్ణుడి పేరు పెట్టాలని అనుకున్నారట. అలాగే ఆమె తన కొడుకు పెద్ద పోలీసాఫీసరు కావాలని కూడా అనుకున్నారంట వెంకట్రావమ్మగారు. యాదృచ్చికంగా ఎన్టీఆర్ తన సినీ నటనా జీవితాన్ని పోలీసు పాత్రతోనే మొదలు పెట్టారు. అలా ఎన్టీఆర్ విశ్వవిఖ్యాతుడయ్యేందుకు తల్లి శుభాశీస్సులు, శుభకామనలు సదా ఆయన వెంటే నిలిచాయ‌ని ఆయ‌న ఎదిగాక చెప్పుకుంటూ ఉంటారు.
                     

అందుకేనేమో ఎన్టీఆర్ కు మహిళలంటే అమితమైన గౌరవాభిమానాలుండేవి .. సమాజంలో ఇంచుమించు సగం మంది స్త్రీలు ఉన్నా వారి సంక్షేమం కోసం, అభ్యుదయం కోసం జరగవలసిన కృషి జరగలేదని ఆయన బాధపడుతుండేవారు. అర్థికంగా తన కాళ్లమీద తాను నిలబడినప్పుడే, రాజకీయ, సామాజిక రంగాలలో పురుషుడి సరసన ధీటుగా నిలబడి స్త్రీ పురోగమించగలుగుతుందని ఎన్టీఆర్ భావించారు. స్త్రీలకు సమాన గౌరవ మర్యాదలుగల హోదాను అనుభవించడానికి వీలుగా అనేక రకాల కార్యక్రమాలకు, చట్టాలకు ఎన్టీఆర్ పాలనలోనే బీజం పడింది. చివ‌ర‌కు ఆస్తి హ‌క్కులో స‌మాన వాటా కూడా స్త్రీల‌కు ఇచ్చిన సంగ‌తి తెలిసిందే ..


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: