`తండేల్` మూవీతో క్రేజీ హిట్ అందుకుని ఫుల్ జోష్ లో ఉన్న యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య.. ప్రస్తుతం సుకుమార్ శిష్యుడు, `విరూపాక్ష` ఫేమ్‌ కార్తీక్ వ‌ర్మ దండు ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. `ఎన్‌సీ 24` వర్కింగ్ టైటిల్ తో రీసెంట్‌గా ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్ళింది. పది రోజుల షూటింగ్ కూడా కంప్లీట్ అయింది. థ్రిల్లర్ కాన్సెప్ట్ కావడంతో ఈ మూవీ చిత్రీకరణ ఎక్కువ శాతం సెట్స్ లోనే జరుగుతోంది. ఇందులో భాగంగానే ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్ర.. హైద‌రాబాద్ లో కార్తీక్‌ దండు-నాగచైతన్య కాంబో మూవీ కోసం రూ. 5 కోట్ల వ్య‌యంతో ఓ భారీ సెట్ వేశారు.


సినిమాలోని పలు కీలక సన్నివేశాలను ఈ సెట్ లో చిత్రీకరించబోతున్నారు. అయితే సెట్ ఎక్స్పీరియన్స్ చేయించడం కోసం తాజాగా మీడియా ప్రతినిధులను చిత్ర‌బృందం ఆహ్వానించింది. ఈ సందర్భంగా మీడియాతో సినీ యూనిట్ కాసేపు స‌ర‌దాగా ముచ్చ‌టించింది. చాలా రోజుల నుంచి ఈ చిత్రానికి `వృషకర్మ` అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై రిపోర్టర్ ప్రశ్నించగా.. దర్శకుడు కార్తీక్ దండు బదులిచ్చాడు.


చైతూతో చేస్తున్న ఈ చిత్రం కోసం మూడు పవర్ ఫుల్ టైటిల్స్ అనుకుంటున్నాం. అందులో వృషకర్మ ఒకటి. ఇంకో రెండు మంచి టైటిల్స్ కూడా ఉన్నాయి. ఆ మూడింటిలో ఒకదాన్ని ఖరారు చేస్తామని కార్తీక్ దండు పేర్కొన్నారు. విరూపాక్ష మాదిరే టైటిల్ క్యాచీగా ఉండాలి. జ‌నాల్లోకి త్వ‌ర‌గా వెళ్లాలి. అటువంటి టైటిల్‌ కోసం అన్వేషిస్తున్నాం  అంటూ చెప్పుకొచ్చి సినిమాపై అంచనాలను పెంచేశారు. ప్రస్తుతం కార్తీక్‌ దండు కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కాగా, ట్ర‌జ‌ర్ హంట్ మ‌రియు మైథ‌లాజిక‌ల్ అంశాలున్న థ్రిల్ల‌ర్ కాన్పెప్ట్ తో రూపొందుతున్న ఈ చిత్రంలో మీనాక్షి చౌద‌రి హీరోయిన్ గా న‌టిస్తోంది. భోగ‌వ‌ల్లి బాపినీడు నిర్మాత‌గా వ్య‌వ‌హిరిస్తున్నారు.  


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: