తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో మంది హీరోయిన్లు ఉన్నారు. అందులో కొంతమంది మాత్రమే వారి నటనతో మంచి గుర్తింపును సంపాదించుకుంటారు. ఇక నేటి కాలంలో చాలామంది యూట్యూబర్లుగా, మోడల్స్ గా, గాయనిగా చిత్ర పరిశ్రమకు పరిచయమై హీరోయిన్లుగా మంచి గుర్తింపు అందుకుంటున్నారు. అలాంటి వారిలో ప్రముఖ నటి కేతిక శర్మ ఒకరు. ఈ భామ మొదట యూట్యూబర్ గా, గాయనిగా, మోడల్ గా తన కెరీర్ ప్రారంభించింది. సినిమాల్లోకి రాకముందే కేతికశర్మ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. తన అద్భుతమైన నటన, అందంతో ప్రేక్షకుల మనసులను ఆకట్టుకుంది. 

అప్పటికే ఈ భామకు విపరీతంగా అభిమానులు ఏర్పడ్డారు. అనంతరం తెలుగులో రొమాంటిక్ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు అందుకున్న కేతిక శర్మ వరసగా సినిమాలు చేసుకుంటూ సక్సెస్ఫుల్ హీరోయిన్ గా తన కెరీర్ కొనసాగిస్తోంది. ఇప్పటివరకు తన కెరీర్ లో ఎన్నో అద్భుతమైన చిత్రాలలో నటించింది. తెలుగులోనే కాకుండా హిందీలో కూడా సినిమాలలో నటిస్తోంది. వరుసగా సినిమా అవకాశాలను అందుకుంటుంది. ప్రస్తుతం ఈ భామ తెలుగులో పలు సినిమాలలో బిజీగా గడుపుతోంది. ఇదిలా ఉండగా.... ప్రస్తుతం కేతిక శర్మ రీసెంట్ గా సింగిల్ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఇందులో శ్రీవిష్ణు హీరోగా చేశారు. 

సినిమా మంచి విజయాన్ని అందుకున్న నేపథ్యంలో సక్సెస్ మీట్ ను నిర్వహించారు. దీనికి అల్లు అరవింద్ కూడా రావడం విశేషం. ఈ క్రమంలోనే అల్లు అరవింద్ వస్తున్న సమయంలో అక్కడే ఉన్న కేతిక శర్మ అతడిని ఆప్యాయంగా పలకరించింది. కానీ అల్లు అరవింద్ మాత్రం తన భుజంపై చేతులు వేసి హగ్ ఇచ్చాడు. ఆ తర్వాత కూడా తన చేతులను ఇష్టం ఉన్నట్టుగా పట్టుకున్నాడు. అల్లు అరవింద్ కి ఇదేమీ కొత్త కాదు. ఇదివరకే చాలా సందర్భాలలో అతనిపై ఇలాంటి విమర్శలు వచ్చాయి. 

చాలామంది హీరోయిన్లను అల్లు అరవింద్ అసభ్యంగా ముట్టుకుంటాడని ఎన్నో రకాల వార్తలు వైరల్ అయ్యాయి. కానీ అల్లు అరవింద్ ఇప్పటికీ ఏమాత్రం మారకుండా హీరోయిన్లను భుజంపై చేతులు వేయడం, గట్టిగా పట్టుకోవడం లాంటి పనులు చేస్తూనే ఉంటాడు. దీనిపై కొంతమంది నేటిజన్లు ఫైర్ అవుతున్నారు. తన ప్రవర్తనను మార్చుకోవాలని అంటున్నారు. దీనిపై అల్లు అరవింద్ ఎలా స్పందిస్తారో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: