
ప్రస్తుతం రామ్ చరణ్ పెద్ది సినిమాలో షూటింగ్ లో బీజీగా ఉన్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ నటిస్తుంది. పెద్ది సినిమాకు ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్నారు. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాకు ఎఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. మొన్న ఈ మధ్యే రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. కానీ ఈ సినిమా మిక్స్డ్ టాక్ ని సొంతం చేసుకుంది.
ఇదిలా ఉండగా.. హీరో రామ్ చరణ్ అరుదైన గౌరవాన్ని పొందారు. లండన్ లోని మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో నటుడు రామ్ చరణ్ మైనపు విగ్రహాన్ని ఇటీవలే ప్రతిష్టించారు. ఇకపోతే రామ్ చరణ్ మొదటి చిరుత తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. ఆ తర్వాత మగధీర సినిమాలో నటించి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి మంచి క్రేజ్ ని సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత ఆరెంజ్, గోవిందుడు అందరివాడేలే, ఎవడు, ఆర్ఆర్ఆర్, గేమ్ ఛేంజర్ , రచ్చ, చిరుత, నాయక్, దృవ వంటి సినిమాలలో నటించారు.