ఇన్నాళ్లు చిరంజీవి సినిమాలో హీరోయిన్ ఎవరా..? ఎవరా..? అంటూ జుట్టు పీక్కున్నారు . నోటికి వచ్చిన మాటలు మాట్లాడారు.  ఇష్టం వచ్చిన హీరోయిన్ పేరు అనుకున్నారు.  ఫైనల్లీ అనిల్ రావిపూడి తాను చేసే పని సైలెంట్ గా చేసేసాడు.  ఎవరు ఊహించని విధంగా స్టార్ హీరోయిన్ రంగంలోకి దించారు . అఫ్ కోర్స్ నయనతార - చిరంజీవి సినిమాలో నడుస్తుంది అంటూ వార్తలు వినిపించాయి . కానీ 80% జనాలు ఈ విషయాన్ని నమ్మనే నమ్మలేదు . ఎందుకంటే అనిల్ రావిపూడి సినిమాకి ప్రమోషన్స్ ఎక్కువగా చేస్తారు.


నయనతార తాను కమిట్ అయిన  సినిమాకి అసలు ప్రమోషన్స్ చేయదు. మరి ఎలా వీళ్ల కాంబో సెట్ అవుతుంది అని అంతా అనుకున్నారు. సీన్ కట్ చేస్తే మా సినిమాలో హీరోయిన్ నయనతారనే అంటూ ఒక స్పెషల్ క్రేజీ వీడియోతో అనౌన్స్ చేశారు అనిల్ రావిపూడి.  ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. సినిమాపై హ్యూజ్ హైప్స్ పెంచేసింది.  అయితే చిరంజీవి పక్కన చాలామంది హీరోయిన్స్ అనుకున్నారట . దాదాపు తొమ్మిది మంది హీరోయిన్స్ పైగానే ఈ క్యారెక్టర్ కి అనుకుని వద్దూ అంటూ రిజెక్ట్ చేశారట.



కాగా అనిల్ రావిపూడి ముందుగా ఈ సినిమాలో హీరోయిన్ గా అంజలిని అనుకున్నారట . కానీ అంజలి ఈ క్యారెక్టర్ కి కి పెద్దగా సూట్ అవ్వదు అంటూ మేకర్స్ వద్దనుకున్నారట.  ఆ తర్వాత ఈ రోల్ కోసం బాలీవుడ్ హాట్ బ్యూటీ సోనాక్షి సిన్హా ని కూడా అనుకున్నారట .ఆ తర్వాత జ్యోతిక.. కాజల్ అగర్వాల్.. మీనా లాంటి..అతిధి రావు హైదరి లాంటి  స్టార్ హీరోయిన్ లని చాలామందిని అనుకున్నారట . కానీ అనిల్ రావిపూడి అంటే తన సినిమాలో కొత్తదనంతో పాటు హీరోయిన్ క్యారెక్టర్స్ బాగా హైలైట్ చేస్తూ ఉంటారు.  ఫిజిక్ కూడా ఉండాలి ..ఆ కారణంగానే చాలామంది వద్దు వద్దు అంటున్న నయనతార ని చూస్ చేసుకున్నారట. హైలెట్ ఏంటంటే నయనతార కూడా సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది . ఈ సినిమా ఖచ్చితంగా మరొక 100 కోట్లు క్రాస్ చేస్తుంది అంటున్నారు అనిల్ రావిపూడి అభిమానులు. సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ అవుతుంది అంటూ కూడా ప్రకటించేశారు . అందుతున్న సమాచారం ప్రకారం "సంక్రాంతికి రఫ్పాడించేద్దాం" అని ఈ సినిమా టైటిల్ పెట్టబోతున్నారట..!

మరింత సమాచారం తెలుసుకోండి: