యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తన కెరియర్ లో ఎంతో మంది హీరోయిన్లతో ఆడి పాడాడు. ఇకపోతే తారక్ కి అద్భుతంగా కలిసి వచ్చిన కొంత మంది హీరోయిన్లు కూడా ఉన్నారు. అలా తారక్ సూపర్ గా కలిసి వచ్చిన నటీమణులలో కాజల్ అగర్వాల్ ఒకరు. తారక్ , కాజల్ కాంబోలో మొదటగా బృందావనం అనే సినిమా వచ్చింది. ఈ మూవీ మంచి విజయాన్ని సాధించింది. ఈ మూవీ తర్వాత వీరి కాంబోలో వచ్చిన బాద్ షా , టెంపర్ మూవీ లు కూడా సూపర్ సక్సెస్ అయ్యాయి. ఇకపోతే కాజల్ అగర్వాల్ , తారక్ మంచి స్నేహితులు కూడా. ఇది ఇలా ఉంటే కాజల్ అగర్వాల్ ఎంతో మంది హీరోయిన్లతో నటించిన కూడా తారక్ కోసం తన కెరియర్లో ఎప్పుడు చేయని పని ఒకటి చేసింది.

అలాగే తారక్ సినిమా తర్వాత మళ్లీ కెరియర్ లో ఇప్పటివరకు కాజల్ ఏ సినిమాలో కూడా అలాంటి పాత్ర చేయలేదు. అది ఏమిటి అనుకుంటున్నారా ..? స్పెషల్ సాంగ్. కాజల్ అగర్వాల్ ఇప్పటివరకు కెరియర్ను మొదలు పెట్టి చాలా సంవత్సరాలు అవుతుంది. ఈమె ఇప్పటివరకు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా రూపొందిన జనతా గ్యారేజ్ సినిమాలో తప్ప మరే మూవీలో కూడా స్పెషల్ సాంగ్ చేయలేదు. జనతా గ్యారేజ్ సినిమాలో ఈ బ్యూటీ చేసిన స్పెషల్ సాంగ్ అద్భుతమైన గుర్తింపు వచ్చింది. ఆ సాంగ్లో కాజల్ తన అందాలతో , డాన్స్ తో ప్రేక్షకులను కట్టి పడేసింది. ఇక ఈ సాంగ్ తర్వాత ఈ బ్యూటీ అనేక సినిమాలలో స్పెషల్ సాంగ్ చేస్తుంది అని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పటివరకు కాజల్ ఏ సినిమాలో స్పెషల్ సాంగ్ చేయలేదు. కేవలం ఇప్పటివరకు ఈ బ్యూటీ తారక్ నటించిన జనతా గ్యారేజ్ సినిమాలో మాత్రమే స్పెషల్ సాంగ్ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: