కాస్టింగ్ కౌచ్ సినిమా ఇండస్ట్రీలో తరచుగా వినిపించే మాట. కాస్టింగ్ కౌచ్ పై ఎవరో ఒకరు స్పందిస్తూనే ఉంటారు. దీంతో కాస్టింగ్ కౌచ్ వార్తలు మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంటాయి. ఇక తాజాగా మరో హీరోయిన్ సైతం తాను కాస్టింగ్ కౌచ్ బాధితురాలినే అని స్పష్టం చేసింది. ఆ హీరోయిన్ మరెవరో కాదు సయామీ ఖేర్. ఈమె పేరు చెబితే గుర్తు పట్టకపోవచ్చు కానీ సయామీ ఖేర్ మన్మథుడు నాగార్జున సినిమా వైల్డ్ డాగ్ లో నటించించి ప్రశంసలు అందుకుంది. అయితే తాజాగా ఓ టాలీవుడ్ డైరెక్టర్ తనను కమిట్మెంట్ అడిగాడు అంటూ సయామీ సంచలన ఆరోపణలు చేసింది. 

ఓ ఇంటర్వ్యూలో సయామీ మాట్లాడుతూ... తనకు వచ్చిన అన్ని ఆఫర్ల విషయంలో చాలా అదృష్టవంతురాలినని భావిస్తానని చెప్పింది. కానీ తనకు 19 ఏళ్ల వయసుకున్నప్పుడు ఒక తెలుగు సినిమా ఆఫర్ వచ్చిందని తెలిపింది. లేడీ ఏజెంట్ ఒకరు తనను పిలిచి నీకు తెలుసా ఇక్కడ కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంటుందని చెప్పిందని ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో తాను ఆమెను టెస్ట్ చేయడానికి ప్రయత్నించానని, ఎందుకంటే ఒక మహిళ మరొక మహిళతో ఇలా చెబుతుందని అనుకోలేదని తెలిపింది. మీరు ఏం చెబుతున్నారో నాకు అర్థం కావడం లేదని అన్నానని, తాను అదే పదే పదే చెప్పడంతో ఆమె చూడండి మీరు అర్థం చేసుకోవాలని చెప్పిందని తెలిపింది.

దీంతో నేను ఈ మార్గంలో వెళ్లాల్సిన వ్యక్తిని అని మీరు భావిస్తున్నందుకు బాధగా ఉంది. నా జీవితంలో ఎప్పుడూ కొన్ని పరిమితులు ఉంటాయి. అని ఆమెతో గట్టిగా చెప్పానని స్పష్టం చేసింది.  కెరీర్ లో ఒక్కసారి మాత్రమే తనకు అలాంటి అనుభవం ఎదురైందని చెప్పింది. ఇదిలా ఉంటే సయామీ సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన రేయ్ సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైంది. వైవీఎస్ చౌదరి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఆ తరవాత పలు సినిమాలు వెబ్ సిరీస్ లలో నటించింది. కెరీర్ లో సయామీ చాలా సినిమాలే చేసింది కానీ స్టార్ హీరోయిన్ ఇమేజ్ సంపాదించుకోలేకపోయింది.


మరింత సమాచారం తెలుసుకోండి: