
డైరెక్టర్ శైలేష్ కొలను ఇటీవలే విడుదలైన హిట్ 3 సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నారు. ఈయన 2022లో హిట్ ది ఫస్ట్ కేస్ మూవీని రూపొందించి ప్రేక్షకుల నుండి మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు. అయితే శైలేష్ మొదట ఉనికి అనే షార్ట్ ఫిలింతో మంచి గుర్తింపు సాధించారు. వాటికి ముందే చెక్ లిస్ట్, క్రోమ్యాట్స్, క్రోమ్ యాడ్స్ వంటి షార్ట్ ఫిలిమ్స్ కూడా తీశారు. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ హనుమాన్ సినిమాతో మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు. ఈయన జాంబి రెడ్డి, అ! వంటి మూవీలు కూడా తీశారు. సినిమాల కన్నా ముందు ప్రశాంత్ వర్మ కొన్ని షార్ట్ ఫిలిమ్స్ కూడా తీశారు. దీనమ్మ జీవితం, డైలాగ్ ఇన్ ద డార్క్, సైలెంట్ మెలోడీ, సావిత్రి లాంటి షార్ట్ ఫిలిమ్స్ కూడా ప్రేక్షకులకు అందించారు. డైరెక్టర్ వివేక్ ఆత్రేయ మొదట వసంతాయనం, రాంగ్ నెంబర్, ఆ నిశి లో, అంజన లాంటి షార్ట్ ఫిలిమ్స్ తో మంచి ఇమేజ్ ని సొంతం చేసుకున్నారు.
కె.వి అనుదీప్ మిస్డ్ కాల్ అనే షార్ట్ ఫిలిం తీశారు. తర్వాత జాతి రత్నాలు అనే సినిమాతో ప్రేక్షకులను మెప్పించారు. నాన్న, ఊహ లోకం, బండి లాంటి షార్ట్ ఫిలిమ్స్ తీసిన వెంకటేష్.. కంచర్లపాలెం, ఉమా మహేశ్వర వంటి సోల్ ఫుల్ మూవీస్ ని ప్రేక్షకులకు అందించారు. అష్ట చమ్మ, జెంటిల్ మ్యాన్, అమీ తుమి లాంటి మూవీస్ ని తెరపైకి తీసుకొచ్చి ప్రేక్షకులను ఆకట్టుకున్న మోహన్ కృష్ణ ఇంద్రగంటి.. చలి, లైఫ్ ఆఫ్ ఎ గర్ల్ అనే షార్ట్ ఫిలిమ్స్ ని కూడా తీశారట. సుహాస్ హీరోగా తెరపైకి తీసుకువచ్చిన కలర్ ఫోటో సినిమాని సందీప్ రాజ్ డైరెక్ట్ చేశారు. అయితే సందీప్ రాజ్ తను షార్ట్ ఫిలిం ని కూడా సుహస్ తోనే చేశారట. మహానటి, కల్కి సినిమాలతో పాపులర్ అయిన నాగ అశ్విన్ యాదోన్ కీ బారాత్ అనే షార్ట్ ఫిలిం తీశారు. లగ్గం షార్ట్ ఫిలిం తీసిన ఆదిత్య హాసన్ 90s మూవీ తెరపైకి తీసుకొచ్చారు. నీ మాయలో, స్పందన వంటి షార్ట్ ఫిలిమ్స్ తో పేరు సంపాదించుకున్న ఆర్. ఎస్ నాయుడు నన్ను దోచుకుందువటే, సుధీర్20 సినిమాలను తెరపైకి తీసుకువచ్చారు. బ్యాక్ స్పేస్, మధురం షార్ట్ ఫిలిమ్స్ తీసిన ఫణీంద్ర నారి శెట్టి 8 వసంతాలు సినిమాను తీశారు.