
అయితే తాజాగా ఈ విషయంపై టాలీవుడ్ సీనియర్ హీరో రాజేంద్రప్రసాద్ స్పందించారు. ఆయన సోషల్ మీడియా వేదికగా షాకింగ్ కామెంట్స్ చేశారు. సినీ ఇండస్ట్రీలో ఉన్న వారంతా కళాకారులని తెలిపారు. అసలు సీఎంని ఎందుకు కలవాలని ప్రశ్నించారు. మరి ముఖ్యంగా అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే సీఎంని కలవాల్సిన అవసరం ఏముందని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది చూసిన కొంతమంది నెటిజన్స్ పవన్ కి గట్టి సమాధానమిచ్చావంటూ కామెంట్స్ చేస్తుంటే.. మరికొందరు మాత్రం ఇది గతంలోని వీడియో అని అంటున్నారు.
ఇకపోతే త్వరలో పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమా వచ్చే నెల 12వ తేదీన థియేటర్లలో రిలీజ్ అవ్వనుంది. ఈ మూవీలో మొఘల్ చక్రవర్తుల కాలంలో కోహినూర్ వజ్రం కోసం పోరాటం చేసే యోధుడు హరిహర వీరమల్లు పాత్రలో పవన్ కళ్యాణ్ కనిపించనున్నారు. ఈ మూవీలో గ్లామరస్ బ్యూటీ నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. హరిహర వీరమల్లు సినిమాకు డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి మరియు ఎ. ఎం జ్యోతికృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. యాక్షన్ అడ్వెంచర్ మూవీగా తెరకెక్కనున్న ఈ సినిమాకు MM కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో బాబీ డియోల్ ఔరంగజేబు పాత్రలో కనిపించనున్నారు.