
విజయేంద్ర ప్రసాద్ కు పూరి జగన్నాథ్ అంటే ఎంతో ఇష్టం. అతని స్పీడ్ రైటింగ్ స్టైల్ .. చకచకా సినిమా తీసే విధానం చూసి విజయేంద్ర ప్రసాద్ ముచ్చటపడతారు. ఈ విషయాన్ని చాలా సార్లు చెప్పారు. తన ఫోన్ వాల్ పేపర్ మీద కూడా పూరి జగన్నాథ్ ఫోటో నే పెట్టుకుంటానని విజయేంద్ర ప్రసాద్ చాలాసార్లు చెప్పారు. పూరితో ఒక్కసారైనా కలిసి పని చేయాలని తన కోరికగా ఉందని గతంలో నే బయట పెట్టారు. ఇన్నేళ్ల కు పూరి జగన్నాథ్ విజయేంద్ర ప్రసాద్ కలిశారు. ఆ ఫోటోను కూడా పూరి - ఛార్మి టీం రిలీజ్ చేసింది. ఈ క్రమంలోనే పూరి జగన్నాథ్ కు విజయేంద్ర ప్రసాద్ ఓ సలహా ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇకపై ఏ కథ రాసినా దానిని ఒకసారి తనకు పంపించమని రిక్వెస్ట్ చేశారట. చాలా స్పీడ్ గా కథలో రాసి అంతే స్పీడ్ గా ప్లాపులు తెచ్చుకుంటున్నాడని బాధ విజయేంద్ర ప్రసాద్ కి ఉంది. పూరి కి ఉన్న క్రేజ్ కు పూరి ఎన్నో హిట్లు కొట్టాలని.. తిరుగులేని ఫామ్ లో ఉండాలన్నదే విజయేంద్ర ప్రసాద్ బాధ. కానీ పూరి చూస్తే వరుసగా డిజాస్టర్ల మీద డిజాస్టర్లు ఇస్తున్నాడు. అసలు పూరి గత పది సినిమాలను చూస్తే ఒక్క ఇస్మార్ట్ శంకర్ మినహా అన్ని బిగ్ ప్లాపులే.
పైగా లైగర్ - డబుల్ ఇస్మార్ట్ తో పూరి క్రేజ్ పాతాళంలోకి వెళ్లిపోయింది. ఇప్పుడు విజయ్ సేతుపతిని పట్టేసి సినిమా చేస్తున్నాడు. ఈ క్రమంలోనే పూరికి విజయేంద్ర ప్రసాద్ ఇకపై ప్రతి కథ తనకు పంపమని సలహా ఇచ్చారట. ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిశారు ... కాబట్టి పూరి తన కొత్త సినిమా స్క్రిప్ట్ను టాలీవుడ్ లోనే అత్యంత పాపులర్ రచయితగా పేరు తెచ్చుకున్న విజయంత ప్రసాద్ కు పంపిస్తారా ? అసలు ఇప్పుడున్న పరిస్థితులలో విజయేంద్రప్రసాద్ అంత ఖాళీగా ఉన్నారా ? మరి పూరికి హెల్ఫ్ చేస్తే విజయేంద్ర ప్రసాద్ కుమారుడు రాజమౌళి ఊరుకుంటాడా ? అన్న ప్రశ్నలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు