
అయితే తాజాగా ఓ వార్త సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతుంది. అదేంటని ఆలోచిస్తున్నారా.. మాస్ మహారాజ్ రవితేజ నటించిన బెంగాల్ టైగర్ సినిమా త్వరలో రిలీజ్ అవ్వనుంది. ఈ సినిమా డైరెక్టర్ సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కింది. బెంగాల్ టైగర్ మూవీని శ్రీ సత్య సాయి ఆర్ట్స్ పతాకం కే.కే. రాధామోహన్ నిర్మించారు. ఈ సినిమాలో మిల్క్ బ్యూటీ తమన్నా, గ్లామరస్ బ్యూటీ రాశి కన్నా హీరోయిన్లుగా నటించారు. భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఈ సినిమాకు భీమ్స్ సంగీతం అందించారు. బెంగాల్ టైగర్ మూవీ 3.25 రేటింగ్ ని సొంతం చేసుకుంది.
అయితే ఇటీవల విడుదలైన భైరవం సినిమాకు నిర్మాతగా కే.కే. రాధమోహన్ వ్యవహరించారు. ఈ సినిమా మంచి సక్సెస్ అందుకోవడంతో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఆ ప్రెస్ మీట్ లో రాధమోహన్ రీరిలీజ్ సినిమాల గురించి ఆసక్తికర విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నారు. గతేడాదిగా రిలీజ్ అనే ట్రెండ్ కొనసాగుతుందని అన్నారు. ఒకరిని చూసి మరొకరు రిలీజ్ చేస్తూ పోతున్నారని చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే తను కూడా బెంగాల్ టైగర్ సినిమాని మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ఆలోచన చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ విషయంపై ఇప్పటికీ తను ఛాంబర్లో ఎలాంటి డిస్కషన్ చేయలేదని తెలిపారు, దీనిపై చర్చించి అందరం కలిసి నిర్ణయం తీసుకుంటామని రాధా మోహన్ తెలిపారు. అయితే బెంగాల్ టైగర్ రిలీజ్ చేస్తే శుక్రవారం లేదా సోమవారం మాత్రమే చేస్తానని ఆయన వెల్లడించారు.