
తండేల్ అనంతరం కోలీవుడ్ స్టార్ హీరో సూర్యతో చందు మొండేటి ఓ మూవీ ప్లాన్ చేశారు. అయితే సూర్య ప్రస్తుతం వరుస సినిమాలతో చాలా బిజీగా ఉన్నాడు. చందు మొండేటికి ఆయన డేట్స్ ఇవ్వడం అనేది ఇప్పట్లో జరగని పని. ఈ నేపథ్యంలోనే చందు మొండేటి సూర్యతో చేయబోయే ప్రాజెక్ట్ ను పక్కన పెట్టి.. టాలీవుడ్ కు చెందిన ఓ హీరోను లైన్ లో పెట్టాడట. ఇంతకీ ఆ హీరో మరెవరో కాదు ఉస్తాద్ రామ్ పోతినేని. ఇప్పటికే రామ్ కు చందు కథ చెప్పడం.. అది ఆయనకు నచ్చడం జరిగిపోయాయట. ఆలస్మో వీరి సినిమా ఫిక్స్ అయినట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో ప్రచారం జరుగుతోంది.
ప్రస్తుతం రామ్ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ఫేమ్ మహేష్ బాబు దర్శకత్వంలో `ఆంధ్ర కింగ్ తాలూక` అనే సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ ఆల్మోస్ట్ కు ఆఖరి దశకు చేరుకుంది. ఇది కంప్లీట్ అయిన వెంటనే చందు మొండేటి-రామ్ కాంబో మూవీ పట్టాలెక్కనుందని.. ఇక ఈ చిత్రాన్ని కూడా గీతా ఆర్ట్స్ వారే నిర్మించనున్నారని సమాచారం. కాగా, ఈ క్రేజీ కాంబోపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.