
రవితేజ వయసు 57 సంవత్సరాలు . ఆయన ఎప్పుడో ఇండస్ట్రీ లోకి వచ్చాడు. ఇప్పటికీ హీరోగా సినిమాలల్లో నటిస్తున్నాడు . చాలామంది రవితేజ వయస్సు ఉన్నవాళ్లు కూడా ఇండస్ట్రీలో హీరోలుగా నటిస్తున్నారు . హిట్లు కొడుతున్నారు . సక్సెస్ అందుకుంటున్నారు . కానీ రవితేజ వయసులో సగం వయసు లేని హీరోలు కూడా డాన్స్ స్టెప్స్ వేయడానికి అల్లాడిపోతున్నారు. టేకుల మీద టేకులు తీసుకుంటున్నారు . కొరియోగ్రాఫర్లు ఏదైనా స్టెప్స్ చెబితే మా వల్ల కాదు ఇలా కాదు అలా కాదు అంటూ ఆ స్టెప్స్ ని మార్పించేస్తున్నారు .
కానీ రవితేజ అలా కాదు కొరియోగ్రాఫర్ చెప్పిన స్టెప్స్ ని దించేస్తాడు. అది కూడా చిన్న మిస్టేక్ లేకుండా . అది కూడా సింగిల్ టేక్ లోనే . ధమాకా సినిమాలో రవితేజ డాన్స్ పెర్ఫార్మెన్స్ ఏ రేంజ్ లో ఆకట్టుకుందో అందరికీ తెలిసిందే. ఇప్పటికి ఆ పాటలు వింటే ఓ ఊపు వచ్చేస్తుంది. ఎటువంటి డూప్ లేకుండా కేవలం రవితేజ నే 57 సంవత్సరాల వయసులో ఈ విధంగా ఒళ్ళు ఊగిపోయేలా డాన్స్ చేశాడు అంటే ఆయనకు సినిమా పట్ల ఎంత ఇంట్రెస్ట్ ఎంత ప్యాషన్ ఉంది అనేది అర్థం చేసుకోవచ్చు. మిగతా హీరోలు కూడా డాన్స్ చేస్తారు . కానీ రవితేజ అంత ఎనర్జిటిక్ గా ఆయన వయసుకు తగ్గట్టు చేయడంలో ప్రతి ఒక్క హీరో విఫలమయ్యారు అంటున్నారు అభిమానులు . సోషల్ మీడియాలో ఈ న్యూస్ బాగా ట్రెండ్ చేస్తున్నారు రవితేజ అభిమానులు..
!