మెగా డాటర్ నిహారిక కొణిదెలను ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నాగబాబు కూతురిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నిహారిక.. హీరోయిన్ గా బ్రేక్ అందుకోవాలని గట్టి ప్రయత్నాలు చేస్తోంది. తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లోనూ అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది. కానీ ఇంతవరకు నిహారికకు సరైన హిట్ మాత్రం పడలేదు. అటు పెళ్లి కూడా కలిసి రాలేదు. జొన్నలగడ్డ చైతన్య అనే వ్యక్తిని 2020లో నిహారిక వివాహం చేసుకుంది. వీరిది పెద్దలు కుదిర్చిన సంబంధం. అత్యంత వైభవంగా జరిగిన వీరి వివాహం చివరకు విడాకులతో ముగిసింది.


ఆ త‌ర్వాత నిహారిక త‌న ఫోక‌స్ మొత్తాన్ని కెరీర్ పైనే పెట్టింది. నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టింది. న‌టిగా, నిర్మాత‌గా రాణిస్తోంది. ఇక‌పోతే గ‌తంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తాను సింగిల్ గానే ఉండిపోనని, కచ్చితంగా భ‌విష్య‌త్తులో మరో పెళ్లి చేసుకుంటానని స్పష్టం చేసింది. అయితే తాజాగా ఆమె రెండో పెళ్లికి సంబంధించి ఓ న్యూస్ నెట్టింట వైరల్ అవుతుంది.


టాలీవుడ్ కు చెందిన యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సిద్ధు జొన్న‌లగ‌డ్డ‌ తో నిహారిక ప్రేమాయణం సాగిస్తోందని.. త్వ‌ర‌లో ఇద్ద‌రూ ఏడ‌డుగులు కూడా వేయ‌నున్నారు అన్న‌దే ఆ వార్త సారాంశం. నిహారిక నిర్మాణంలో వచ్చిన సూప‌ర్‌ హిట్ మూవీ `కమిటీ కుర్రాళ్ళు` సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సిద్ధు జొన్నలగడ్డ హాజరయ్యాడు. అయితే అప్పటినుంచే ఇద్దరు క్లోజ్ అయ్యారట‌. ఇప్పుడు వారి బంధం మరింత బలపడటంతో పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారని.. ప్రస్తుతం మెగా ఫ్యామిలీలో నిహారిక రెండో పెళ్లిపై చర్చలు జరుగుతున్నాయని ప్ర‌చారం జ‌రుగుతోంది. కాగా, గ‌తంలో నిహారిక రెండో పెళ్లి ఇటువంటి వార్త‌లు చాలానే వ‌చ్చాయి. కానీ అవి చివ‌ర‌కు పుకార్లుగా మిగిలాయి. మ‌రి ఇది కూడా అటువంటి గాలి వార్తేనా? అన్న‌ది తెలియాల్సి ఉంది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: