జయం రవి ఈ మధ్యకాలంలో కోలీవుడ్ లో ఎక్కువ ట్రెండింగ్ లో ఉన్న పేరు.. జయం రవి తన భార్య ఆర్తికి విడాకులు ఇస్తున్నట్టు ప్రకటించి కోలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా నిలిచారు. ఈయన ఆర్తికి విడాకులు ఇస్తున్నట్టు ఎప్పుడైతే ప్రకటించారో అప్పటినుండి జయం రవి పర్సనల్ జీవితం గురించి ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో భాగంగా జయం రవి ఆర్తి మధ్యలోకి మూడో వ్యక్తి ఎంట్రీ ఇవ్వడం వల్లే మా మధ్య ఈ విభేదాలు వచ్చాయని ఆర్తి చెప్పుకొచ్చింది. అయితే జయం రవి ఆర్తి మధ్యలోకి సింగర్ కెనీషా ఎంట్రీ ఇవ్వడం వల్లే వీరిద్దరూ విడాకులు తీసుకుంటున్నారు అని స్పష్టంగా అందరికీ అర్థమైంది.కానీ కెనీషా మాత్రం నేను ఎవరిని ట్రాప్ చేయలేదు.. ఆర్తి, ఆర్తి పేరెంట్స్ ఇద్దరు కలిసి జయం రవిని టార్చర్ చేయడం వల్లే ఆ టార్చర్ భరించలేక తన దగ్గరికి వచ్చాడని, నా దగ్గరికి ఒక క్లయింట్ లాగా వచ్చాడు..


నేను ఒక వైద్యురాలి లాగే ఆయనకు చికిత్స చేశాను అని చెప్పుకొచ్చింది. ఇక జయం రవి ఆర్తి విడాకుల వ్యవహారం కోర్టులో ఉన్న నేపథ్యంలో వీరిద్దరూ సోషల్ మీడియా వేదికగా ఒకరిపై ఒకరు చేసుకునే ఆరోపణలపై చెన్నై ఫ్యామిలీ కోర్టు ఫైర్ అయింది. కోర్టులో కేసు ఉండగా ఇలా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకొని కోర్టులో చెప్పాల్సిన విషయాలన్నీ బయట పెట్టుకుంటున్నారు.. ఇంకోసారి ఇలా చేస్తే బాగుండదు అని వార్నింగ్ ఇచ్చింది.దాంతో ఆర్తి జయం రవి ఇద్దరు వెనక్కి తగ్గారు. అయితే తాజాగా జయం రవి విడాకులు రాకముందే సింగర్ కెనీషాని రెండో పెళ్లి చేసుకున్నట్టు సోషల్ మీడియాలో కొన్ని ఫొటోస్ చక్కర్లు కొడుతున్నాయి.

ఇక ఆ ఫోటోలలో జయం రవి కెనీషా ఇద్దరు మెడలో పూల దండలు వేసుకొని కనిపించడంతో చాలామంది నెటిజన్స్ ఇదేంటి జయం రవి విడాకులు రాకుండానే రెండో పెళ్లి చేసుకున్నాడా అని షాక్ అయిపోతున్నారు.. అయితే వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నది నిజం కాదు. ఎందుకంటే తాజాగా జయం రవి కెనీషా ఇద్దరు కలిసి తమిళనాడు కాంచీపురం లో ఉన్న కుండ్రతుర్ మురుగన్ దేవాలయాన్ని సందర్శించారు.అయితే దేవాలయాలకు సెలబ్రిటీలు వెళితే అక్కడున్న పూజారులు వారికి పూలదండలు వేసి పూజారులు ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు. అయితే అలా పూజారులు వేసిన పూలదండలను చూసి వీరిద్దరూ గుడిలో రహస్యంగా పెళ్లి చేసుకున్నట్టు ఒక వార్త వైరల్ చేస్తున్నారు. కానీ వీరిద్దరూ పెళ్లి చేసుకోలేదని జయం రవి సన్నిహితులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: