ప్రస్తుతం టాలీవుడ్ లో రీ రిలీజ్ ట్రెండ్ బాగా నడుస్తున్న సంగతి తెలిసిందే. పాత చిత్రాలకు ఆధునిక టెక్నాలజీతో మెరుగులు అద్ది మళ్లీ థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నారుజ‌ అలా రీసెంట్ గా రీరిలీజ్ అయిన `ఖలేజా` బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. తాజాగా మాస్ మహారాజా రవితేజ ఫ్యాన్స్ ఎగిరి గంతేసే న్యూస్ బయటకు వచ్చింది. రవితేజ కెరీర్ లో సూపర్ హిట్ గా నిలిచిన `వెంకీ` మూవీ రీరిలీజ్ కు సిద్ధమైంది.


2023 డిసెంబర్ లో ఒకసారి ఈ చిత్రాన్ని 4కె క్వాలిటీతో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. అప్పట్లో ఈ సినిమా అదిరిపోయే రెస్పాన్స్ సొంతం చేసుకుంది. అయితే మరోసారి వెంకీ మూవీని రీరిలీజ్ చేయాలని మేకర్స్ నిర్ణయించారు. జూన్ 14న 4కెలో వెంకీ మళ్లీ థియేట‌ర్స్ లో సంద‌డి చేయ‌నుంద‌ని తాజాగా నిర్మాత‌లు అధికారిక ప్ర‌క‌ట‌న చేశారు. దీంతో ర‌వితేజ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
కాగా, శ్రీను వైట్ల దర్శకత్వంలో రవితేజ, స్నేహ జంటగా నటించిన కామెడీ ఎంటర్టైనర్ ఇది. 2004లో విడుదలైన వెంకీ చిత్రం భారీ విజయాన్ని నమోదు చేసింది. ముఖ్యంగా ఈ సినిమాలో కామెడీ ట్రాక్ కు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అందులోనూ ఫస్టాఫ్‌ లో వచ్చే ట్రైన్ ఎపిసోడ్ ను ఇప్పటికీ ప్రేక్షకులు విపరీతంగా ఎంజాయ్ చేస్తుంటారు. గజాలాగా బ్రహ్మానందం, బొక్కగా ఏవీఎస్ పండించిన కామెడీ నెక్స్ట్ లెవెల్ అనే చెప్పుకోవచ్చు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: