టాలీవుడ్ లో హీరోయిన్ శృతిహాసన్ సినిమాలలో కంటే ఎక్కువగా బాయ్ ఫ్రెండ్స్ , లవ్ బ్రేకప్ వంటి విషయంలోనే సోషల్ మీడియాలో ఏదో ఒక విధంగా వైరల్ గా మారుతూ ఉంటుంది. ఈమధ్య సింగిల్ గా తన లైఫ్ ను లీడ్ చేస్తూ ఉన్న ఈ ముద్దుగుమ్మ.. మొదట మైఖేల్ కోర్సేతో సహజీవనం చేసింది. ఆ తర్వాత శాంతాను హాజరికతో రెండేళ్లు డేటింగ్ బాండింగ్ వ్యవహారం చేసింది. ఈ రెండు బ్రేకప్లే కాకుండా సినీ ఇండస్ట్రీలో కూడా చాలామంది హీరోలతో లవ్ బ్రేకప్ అయినట్టుగా వార్తలు వినిపిస్తూ ఉంటాయి.


అందుకే శృతిహాసన్ మళ్లీ ఇలాంటి లవ్ బ్రేకప్ లు జరగకుండా ఉండేందుకు పలు రకాల ప్రయత్నాలు పడుతూ ఉంటుంది. ఇటివలె మళ్లీ తన మాజీ లవర్స్ మెసేజ్లతో టచ్ లోకి వస్తున్నారంటే అవునని తెలియజేస్తోంది. పూర్తి వివరాలలోకి వెళితే ఇటీవలే తన తండ్రి నటించిన థగ్ లైఫ్ సినిమాలో శృతిహాసన్ గాయనిగా పాటలు పాడడం జరిగింది.. విన్ వెలి నాయకా అంటూ పాట పాడిన ఈమె మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఇక అప్పటినుంచి శృతిహాసన్ కు వరుసగా ఫోన్ కాల్స్ వాట్సప్ మెసేజ్ లతో నిండిపోయింది అంటూ తెలుపుతోంది.


ఇప్పటికీ కూడా తనకు మెసేజ్లు వస్తున్నాయని తన పనితనాన్ని మెచ్చుకుంటూ చాలామంది మెసేజ్లు పంపించడం చాలా ఆనందంగా ఉందని తెలిపింది. ఇష్టపడే వాళ్లతో పాటు ఇష్టపడని వాళ్లు కూడా మెసేజ్లు పంపిస్తున్నారని అలాంటి వారిలో తన మాజీ ప్రేమికులు కూడా ఉన్నారంటు తెలియజేసినట్లు సమాచారం.. అయితే ఒక నెటిజన్ నేరుగా ఈ విషయాన్ని శృతిహాసన్ ని అడగగా శృతిహాసన్ నుంచి ఎలాంటి రిప్లై రాకపోవడంతో మౌనం అందుకు అంగీకారం అన్నట్లుగా కామెంట్స్ చేస్తున్నారు. ఇక ప్రస్తుతం శృతిహాసన్ కూలీ సినిమాల నటిస్తూ ఉన్నది. మరికొన్ని చిత్రాలలో కూడా నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ.

మరింత సమాచారం తెలుసుకోండి: