
ప్రస్తుతం ఆమె సహాయక నటిగా రాణిస్తున్నారు. తెలుగులో గత ఏడాది `కల్కి 2898 ఏడీ` మూవీలో కీలక పాత్రలో మెరిశారు. ఈ చిత్రంలో బాలీవుడ్ బిగ్‌బి అమితాబ్ బచ్చన్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడం పట్ల ఇటీవల ఓ ఇంటర్వ్యూలో శోభన సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. కల్కి కన్నా ముందు ఎన్నో ఏళ్ల క్రితం అమితాబ్ బచ్చన్ హీరోగా నటించిన ఓ సినిమాలో శోభన ఒక పాటకు డాన్స్ చేశారు. ఆ సాంగ్ ను అహ్మదాబాద్ లో చిత్రీకరించారు. దాంతో అమితాబ్ బచ్చన్ ను చూసేందుకు అహ్మదాబాద్ ప్రజలు భారీగా సెట్ దగ్గరకు వచ్చేసారు.
సాంగ్ షూటింగ్ ప్రారంభమైంది. ఆ ఒక్క సాంగ్ లో శోభన అనేక కాస్ట్యూమ్స్ మార్చుకోవాల్సి ఉంటుంది. హీరో కోసం స్పెషల్ గా కారవాన్ తెప్పించారు. కానీ శోభనకు మాత్రం ఎటువంటి కారవాన్ లేదు. షూట్‌లో భాగంగా దుస్తులు మార్చుకోవాల్సి రావడంతో `నా కావవాన్ ఎక్కడా?` అని శోభన మూవీ యూనిట్ మెంబర్స్ ను అడిగారట. అయితే వారిలో ఓ వ్యక్తి `ఆమె కేరళ నుండి వచ్చింది. అక్కడి వాళ్ళు దేనికైనా సర్దుకుపోతారు.. సో చెట్టు వెనక్కి వెళ్లి బట్టలు మార్చుకుంటుందిలే` అంటూ శోభనను ఉద్ధేశించి చాలా తక్కువగా మాట్లాడాడట.
అతని మాటలు వాకీ టాకీలో విన్న అమితాబ్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. వెంటనే సదరు వ్యక్తికి చివాట్లు పెట్టి తన కారవాన్ ను శోభనకు ఇచ్చారట. ఈ విషయాన్ని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో శోభన స్వయంగా చెప్పుకొచ్చారు. అమితాబ్ బచ్చన్ ఎంతో మంచి వ్యక్తి. మానవత్వం కలిగిన వ్యక్తి. సంస్కృతి సాంప్రదాయాలకు ఆయన చాలా విలువ ఇస్తారు. ఆనాటి నుండి ఈనాటి వరకు ఆయనేం మారలేదు. అటువంటి యాక్టర్ తో కల్కి మూవీ ద్వారా మరోసారి స్క్రీన్ షేర్ చేసుకోవడం నిజంగా అదృష్టమంటూ శోభన చెప్పుకొచ్చింది.