
సౌత్ స్టార్ హీరో ధనుష్ హీరో గా రష్మిక మందన్నా హీరోయిన్‌గా , అక్కినేని నాగార్జున కాంబోలో మ్యాజికల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల కాంబోలో వస్తున్న అవైటెడ్ మూవీ కుబేర .. ధనుష్ కెరియర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన శేఖర్ కమ్ముల నుంచి వస్తున్న కాస్ట్లీ సినిమా కూడా ఇదే . అయితే ఈ సినిమా ఇప్పుడు అన్ని పనులు పూర్తి చేసుకుంటూ వస్తుండగా షాకింగ్ రన్ టైం ఈ సినిమా కి లాక్ చేసినట్టు గా తెలుస్తుంది .. ఇక దాదాపు శేఖర్ కమ్ముల సినిమాలు ఒకింత ఎక్కువ రన్ టైం లోనే వస్తాయి ..
మరీ అలానే కుబేర కి అంతకు మించిన రన్ టైమ్ ని శేఖర్ కట్ చేసినట్టు తెలుస్తుంది .. దీంతో ఈ సినిమా ఏకంగా 3 గంటల 15 నిమిషాలు ఉంటుందని అంటున్నారు .. అయితే ఇది అత్యంత పెద్ద రన్ టైం ఉన్న కూడా ఇప్పటికే పలు సినిమాలు థియేటర్స్ లో జనాలని కూర్చోబెట్టాయి .. ఇక మరి ఇదే ఈ సినిమాకి పెద్ద సవాలుని చెప్పాలి .. ఇంతసేపు ప్రేక్షకుల్ని సినిమా ఎంగేజ్ చేసేలా ఉంటే పర్లేదు .. కానీ కొంచెం తేడా కొట్టిన సినిమాకే ఎఫెక్ట్ అవుతుంది .. ఇక మరి మేకర్స్ అందుకు తగ్గట్టు జాగ్రత్తలు తీసుకున్నారో లేదా అనేది తెలియాలంటే జూన్ 20 వరకు వేచి చూడాల్సిందే .
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి ..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి .
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు ..