
కథ మొత్తం లగ్జరీ క్రూజ్ షిప్‌లోనే సాగుతుంది. ఓ బిలియనీర్ మర్డర్ చుట్టూ తిరిగే కామెడీ ఎంటర్‌టైనర్ ఇది. స్టోరీ టెంప్లేట్ రొటీన్ గా ఉన్న కామెడీ వర్కోట్ అయింది. అలాగే భారీ క్యాస్టింగ్, కథలో భాగంగా వచ్చే ట్విస్టులు, సర్‌ప్రైజింగ్ కామియోలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని రివ్యూలు వచ్చాయి. దాంతో హౌస్‌ఫుల్ 5 మూవీకి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురుస్తోంది.
విడుదలైన నాలుగు రోజుల్లోనే ఏకంగా రూ. 104.98 కోట్ల నెట్ కలెక్షన్స్ ను వసూల్ చేసి ఔరా అనిపించింది. మండే వర్కింగ్ డే అయినప్పటికీ.. థియేటర్స్ లో హౌస్‌ఫుల్ 5 ఎక్స్‌లెంట్‌గా పర్ఫార్మ్ చేసింది. సోమవారం ఈ చిత్రానికి రూ. 13.15 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చాయి. ప్రస్తుతం థియేటర్స్ లో హౌస్‌ఫుల్ 5 సూపర్ స్టడీగా కొనసాగుతోంది.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు