గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా గేమ్ చేంజర్ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్సా ఫీస్ దగ్గరలో విఫలం అయింది. ఇకపోతే ప్రస్తుతం చరణ్ , బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రూపొందుతున్న పెద్ది అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. జాన్వి కపూర్ ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తూ ఉండగా ... జగపతిబాబు , శివరాజ్ కుమార్మూవీ లో కీలక పాత్రలలో కనిపించనున్నారు. ఏ ఆర్ రెహమాన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

ఈ సినిమాను వచ్చే సంవత్సరం మార్చి 27 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. ఈ మూవీ తర్వాత చరణ్ , సుకుమార్ తో సినిమా చేయనున్నట్లు అధికారిక ప్రకటన కూడా వెలువడింది. కానీ ఈ మధ్య కాలంలో చరణ్ తన తదుపరి మూవీ ని సుకుమార్ తో కాకుండా త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చేయబోతున్నట్లు , ఇప్పటికే అందుకు సంబంధించి అన్ని పనులు ముగిసినట్లు , త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రానున్నట్లు వార్తలు వచ్చాయి. దానితో చాలా మంది కూడా చరణ్ తన తదుపరి మూవీ ని త్రివిక్రమ్ తో చేసి , ఆ తర్వాత సుకుమార్ తో మూవీ చేస్తాడు అని భావించారు.

ఈ లోపు సడన్ గా మరో వార్త వైరల్ అవుతుంది. అది ఏమిటి అంటే ..? రామ్ చరణ్ పెద్ది సినిమా పూర్తి కాగానే సుకుమార్ తో తదుపరి మూవీ చేయనున్నట్లు , ఆ మూవీ పూర్తి అయిన తర్వాతే త్రివిక్రమ్ శ్రీనివాస్ తో మూవీ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇలా చరణ్ నెక్స్ట్ మూవీ కి సంబంధించి అనేక మంది దర్శకుల పేర్లు వినబడుతూ ఉండడంతో మెగా ఫ్యాన్స్ కూడా చరణ్ తదుపరి మూవీ ని ఏ దర్శకుడితో చేస్తాడు అనేది అధికారికంగా ప్రకటిస్తే బాగుంటుంది అని అభిప్రాయ పడుతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: