
సంజయ్ కుమార్ యూకే లో ఉండగా.. ఎక్కువగా పోల్ గేమ్ లో గుర్రాలను నడుపుతూ ఉండేవారు.. అలా నడుపుతున్న సమయంలోనే ఒక తేనెటీగ గొంతులోకి వెళ్లడంతో కొంతమేరకు ఇబ్బంది పడగా హార్ట్ ఎటాక్ వచ్చినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. వెంటనే అక్కడి నుంచి దగ్గరలో ఉండే హాస్పిటల్ కి తరలించగా ఫలితం లేకుండా పోయింది. సంజయ్ కపూర్ ఇండియాలో ప్రముఖ వ్యాపారవేత్తలలో ఒకరిగా పేర సంపాదించారు. కరిష్మా కపూర్ ను 2003లో సంజయ్ పెళ్లి చేసుకున్నారు.
ఆ తర్వాత 2014లో ఈ జంట విడాకులు తీసుకోవడం జరిగింది. వీరికి ఒక కొడుకు కుమారుడు కూడా ఉన్నారు. గతంలో సంజయ్ ఫ్యామిలీపై కరిష్మా కపూర్ గృహహింస కేస్ పెట్టినట్లుగా సమాచారం.ఆ తర్వాత ప్రియా సచ్ దేవ్ ను సంజయ్ వివాహం చేసుకోగా.. ఇప్పుడు ఆయన గుండెపోటుతో మరణించారు. దీంతో ఆయన కుటుంబంలో విషాదఛాయలు ఏర్పడ్డాయి. సంజయ్ కుమార్ ఆటోమేటివ్ వ్యాపార రంగంలో భారీగా పేరు సంపాదించారు. సంజయ్ మృతి పట్ల పలువురు వ్యాపార దిగ్గజ సంస్థలతో పాటు సినీ ప్రముఖులు కూడా సంతాపాన్ని తెలియజేస్తున్నారు. కరిష్మా కపూర్ చెల్లెలి కరీనాకపూర్ బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ ని వివాహం చేసుకున్నది. మరి ఈ విషయంపై కరిష్మా కపూర్ ఎలా స్పందిస్తుందో చూడాలి.