కన్నడలో బీభత్సం సృష్టించిన కాంతార మూవీ ని ఆ తర్వాత ఇతర భాషల్లో కూడా తీసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. అలా బ్లాక్ బస్టర్ అయినటువంటి కాంతార నిమాకి సంబంధించి కాంతార చాప్టర్ 1 తెరకెక్కుతున్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ కాంతార చాప్టర్ 1 షూటింగ్ సమయంలో ఎప్పుడు ఏదో ఒక ప్రమాదం జరుగుతూనే ఉంది.అయితే ఈ వరుస ప్రమాదాలు చూస్త కాంతార మూవీ యూనిట్లోని సభ్యులు బెంబేలెత్తిపోతున్నారు. అంతేకాదు ఈ ప్రమాదాలన్నీ చూస్తుంటే రిషబ్ శెట్టికి పంజుర్లీ చెప్పిన మాటలే నిజమవ్వబోతున్నాయా అని మాట్లాడుకుంటున్నారు. మరి ఇంతకీ పంజుర్లీ దేవత ఏం చెప్పింది.. ఎందుకు కాంతార చాప్టర్ 1 మూవీ షూటింగ్లో వరుస ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి అనేది ఇప్పుడు చూద్దాం. 

కాంతార చాప్టర్ 1 షూటింగ్ స్టార్ట్ అయినప్పటినుండి చాలామంది మరణిస్తున్నారు.అలా షూటింగ్ స్టార్ట్ అయిన మొదట్లో జూనియర్ ఆర్టిస్టులు అందరూ మినీ బస్సులో వెళుతున్న టైం లో బస్సు బోల్తా పడి ఆరుగురికి గాయాలు అయ్యాయి.ఆ తర్వాత ఇద్దరు మరణించారు. ఈ మూవీలో నటించిన జూనియర్ ఆర్టిస్ట్ ఏంఎఫ్ కపిల్ ఈతకు వెళ్లి మరణించాడు. అయితే ఈయన మరణించిన టైంలో షూటింగ్ జరగలేదు. కాబట్టి సినిమాకి ఆయన మరణానికి సంబంధం లేదని మాట్లాడుకున్నారు. ఆ తర్వాత కొద్ది రోజులకే కాంతార సినిమాలో చేసిన రాకేష్ పూజారి హార్ట్ ఎటాక్ తో మరణించారు.ఇక ఈయన మరణించిన సమయంలో చాలా గుసగుసలు వినిపించాయి.

ముఖ్యంగా రాకేష్ పూజారి మరణించిన సమయంలో రిషబ్ శెట్టి చూడడానికి కూడా వెళ్లకపోవడంతో ఎన్నో ఊహగాణాలు తెర మీద వినిపించాయి. కానీ తర్వాత కొద్ది రోజులకు రాకేష్ పూజారి కుటుంబ సభ్యులను రిషబ్ శెట్టి కలవడంతో ఈ రూమర్లకు తెరపడింది. ఇలా కాంతార చాప్టర్ 1 మూవీ షూటింగ్ స్టార్ట్ అయినప్పటి నుండి వరుస ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.అయితే తాజాగా ఈ సినిమాలో నటిస్తున్న జూనియర్ ఆర్టిస్టు విజువికె గుండెపోటుతో మరణించారు. అయితే ఈ సినిమా షూటింగ్ మొదలైనప్పటినుండి వరుస ప్రమాదాలు చోటు చేసుకోవడంతో శాండల్ వుడ్ లో ఈ సినిమా గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు.

ఎందుకు ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయినప్పటి నుండి ఇలా వరుస మరణాలు చూడాల్సి వస్తుంది అని భయాందోళనకు గురవుతున్నారు.అంతేకాదు షూటింగ్లో పాల్గొన్న వాళ్లు నెక్స్ట్ ఎవరో అని ప్రాణాలు అర చేతిలో పెట్టుకొని వణికిపోతున్నారట. అయితే ఇవన్నీ చూస్తూ ఉంటే గతంలో పంజుర్లీ దేవత రిషబ్ శెట్టికి చెప్పిన మాటలే గుర్తుకు వస్తున్నాయి. పంజుర్లీ దేవత హెచ్చరించింది రిషబ్ ని హెచ్చరించింది. నీ చుట్టూ చాలామంది శత్రుమూకలు ఉన్నాయని, వాళ్లు నీపై భారీ కుట్ర చేస్తున్నారని, కానీ నీవు నమ్మిన దేవుడు నిన్ను ఎల్లవేళలా కాపాడతాడని హెచ్చరించింది. ఇక షూటింగ్లో పాల్గొనే వారి వరుస మరణాలకి దేవుడికి ఏదైనా లింకుందా అని శాండిల్ వుడ్ మొత్తం మాట్లాడుకుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: