తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న నటులలో నితిన్ ఒకరు. ఈయన ఇప్పటివరకు తన కెరియర్లో ఎన్నో విజయాలను అందుకున్నాడు. కానీ ఈ మధ్య కాలంలో మాత్రం నితిన్ కి సరైన విజయం దక్కడం లేదు. వరుసగా ఈయన నటించిన చాలా సినిమాలు బాక్సా ఫీస్ దగ్గర బోల్తా కొడుతూ వస్తున్నాయి. కొంత కాలం క్రితం ఈయన రాబిన్ హుడ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలం అయింది.

ఇది ఇలా ఉంటే తాజాగా నితిన్ "తమ్ముడు" అనే సినిమాలో హీరో గా నటించాడు. వర్షా బొల్లమ్మ , సప్తమి గౌడ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించగా ... వేణు శ్రీరామ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. కొన్ని సంవత్సరాల క్రితం తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన నటిగా కెరియర్ను కొనసాగించిన లయమూవీ లో ఓ కీలకమైన పాత్రలో కనిపించబోతుంది. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించాడు. ఈ మూవీ ని జూలై 4 వ తేదీన విడుదల చేయనున్నారు. కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ బృందం ఈ సినిమా ట్రైలర్ను విడుదల చేసింది. దానికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమాలోని మొదటి సాంగ్ విడుదలకు సంబంధించిన ప్రకటనను విడుదల చేసింది. 

ఈ మూవీలోని "భూ అంటూ భూతం" అంటూ సాగే మొదటి లిరికల్ వీడియోను జూన్ 17 వ తేదీన సాయంత్రం 5 గంటలకు విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ను కూడా విడుదల చేసింది. ఇకపోతే ఈ సినిమాకు అజనీష్ లోకనాథ్ సంగీతం అందించాడు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి మేకర్స్ విడుదల చేసిన ట్రైలర్ కు జనాల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. ఈ మూవీ మొదటి సాంగ్ కి కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నట్లయితే ఈ సినిమాపై జనాల్లో అంచనాలు మరింత పెరిగే అవకాశం ఉంది అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: