బాలీవుడ్,టాలీవుడ్ నటుడుగా పేరుపొందిన రాహుల్ దేవ్  గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. సింహాద్రి, అతడు, పౌర్ణమి తదితర చిత్రాలలో నటించి బాగా పేరు సంపాదించారు. ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస చిత్రాలతో బిజీగా ఉన్న ఈ నటుడి తమ్ముడు ముకుల్ దేవ్ కూడా విలన్ గా పలు చిత్రాలలో నటించారు. ముఖ్యంగా కృష్ణ సినిమాతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ముకుల్ దేవ్ ఆ తర్వాత పలు చిత్రాలలో నటించారు. గత కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలతో ముకుల్ మరణించిన సంగతి తెలిసిందే.. చిన్న వయసులోనే మరణించడంతో అటు అభిమానులు సిని సెలబ్రెటీలు కూడా ఆశ్చర్యపోయారు.



తన సోదరుడు మరణం పైన రాహుల్ దేవ్ మాట్లాడుతూ పలు విషయాలను తెలిపారు.. ముకుల్ మరణానికి డిప్రెషన్ కారణమని ఆరోగ్యం చెడిపోయిందని ఫిట్నెస్ సరిగ్గా లేక మరణించారనే విధంగా వార్తలు వినిపించాయి. అవన్నీ కారణం కాదు అని తెలిపారు.. 2019లో మా తండ్రి మరణించారు ,ఆ మరణం ముకుల్ ను చాలా  తీవ్రంగా కృంగిపోయేలా చేసిందంటూ తెలిపారు. ఆ తర్వాత మళ్లీ తల్లి మరణం, ఆ తర్వాత భార్య నుంచి విడాకులు తీసుకోవడంతో ఒంటరిగా ఫీల్ అయిపోయారని తెలిపారు రాహుల్.


ఇక ఎవరు అండగా తన చుట్టూ లేకపోవడంతో తనని పట్టించుకునే వారు లేకపోవడంతో సరైన ఆహారం లేక ఆసుపత్రి పాలయ్యారని అలా హాస్పిటల్లో మూడు రోజులపాటు ఐసీయూలో ఉన్నారని తెలిపారు.. ముకుల్ సరైన భోజనం లేక అనారోగ్యానికి గురయ్యారని వైద్యులు తెలిపారని తెలిపారు రాహుల్.. కానీ తన సోదరుడు ఆరోగ్యం పైన బయట పలు రకాల ఆరోపణలు చేస్తూ ఉన్నారు.. అలా చేసేవారు ఎవరైనా సరే ఎప్పుడైనా హాస్పిటల్కి వచ్చి అతని పరామర్శించారా అంటూ ప్రశ్నించారు?.. నా తమ్ముడు ఎప్పుడు కూడా ఒంటరిగా ఉండడానికి మక్కువ చూపేవారు.. తన ఆరోగ్యం పైన శ్రద్ధ చూపలేక మరణించారు అంటూ తెలిపారు రాహుల్.

మరింత సమాచారం తెలుసుకోండి: