టాలీవుడ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రజెంట్ దర్శకుడు బుచ్చిబాబు సానా దర్శకత్వం లో పెద్ది అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే .. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ఎంతో వేగంగా జరుగుతుంది .  అలాగే ఈ సినిమా ను రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా దర్శకుడు బుచ్చిబాబు ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాడు .. అలాగే ఈ సినిమా లో రామ్ చరణ్ ఇప్పటివరకు ఏ సినిమాలో కనిపించని సరికొత్త లుక్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు .. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన గ్లింప్స్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే .


అయితే ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్న రామ్ చరణ్ , బుచ్చిబాబు .. తాజాగా పెద్ది సెట్స్ నుంచి ఓ ఇంట్రెస్టింగ్ ఫోటోను తన సోషల్ మీడియా లో పోస్ట్ చేశాడు .. ఇక అందులో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో పాటు బుచ్చిబాబు ఎంతో ఇష్టంగా ఓ సెల్ఫీ ఫోటో తీసుకున్నారు .. ఇక దానికి ఆరెంజ్ సినిమా లోని లవ్ సాంగ్ బ్యాక్ గ్రౌండ్లో యాడ్ చేసి రామ్ చరణ్ పై తనకున్న లవ్‌ను ఆ ఫోటో రూపంలో చూపించాడు .. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది ..


ఇక చరణ్ తో బుచ్చిబాబు బాక్సాఫీస్ పై విధ్వంసం చేయడం ఖాయమని మెగా అభిమానులు గట్టి నమ్మకం వ్యక్తం చేస్తున్నారు .. ఈ సినిమాలో అందాల బ్యూటీ జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా  ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు .. అలాగే ఈ సినిమా ను 2026 సమ్మర్ కానుకగా ప్రేక్షకులు ముందుకు  తీసుకురావడానికి రెడీ అవుతుంది చిత్ర యూనిట్‌ .  ఇక మరి రామ్ చరణ్ ఈ సినిమాతో మరోసారి పాన్ ఇండియా లెవెల్ లో తానేంటో ప్రూవ్ చేసుకుంటాడో లేదో చూడాలి .


మరింత సమాచారం తెలుసుకోండి: