రష్మిక మందన్నా.. టాలీవుడ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది స్టార్ హీరోయిన్. నేషనల్ క్రష్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకొని హ్యూజ్  పాపులారిటి క్రియేట్ చేసుకున్న హాట్ బ్యూటీ . పేరుకి కన్నడ అమ్మాయి కానీ తెలుగులో మాత్రం అమ్మడు ఫ్యాన్ ఫాలోయింగ్ చూస్తే మతులు పోవాల్సిందే . చాలామంది రష్మిక మందన్నా పేరుని పచ్చబొట్టు కూడా పొడిపించుకున్నారు . రష్మిక పై ఉన్న అభిమానంతో తమ పిల్లలకు కూడా రష్మిక పేరు పెట్టిన అభిమానులు కూడా ఉన్నారు. అలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకుని రష్మిక రీసెంట్గా నటించిన సినిమా "కుబేర".


శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన "కుబేర" సినిమా హ్యూజ్ పాజిటివ్ టాక్ అందుకుంది . రిలీజ్ అయిన అన్ని చోట్ల కూడా పాజిటివ్ ప్రశంసలు కురిపిస్తున్నారు జనాలు . మరీ ముఖ్యంగా ధనుష్ పర్ఫామెన్స్ కి వేరే లెవెల్ కామెంట్స్ పెడుతున్నారు . ధనుష్ తప్పితే ఈ పాత్రలో మరి ఏ హీరోయిన్ కూడా సూట్ అవ్వరు అంటూ చాలా ఓపెన్ గానే స్పందిస్తున్నారు . అయితే ఈ సినిమాలో నాగార్జున కీలకపాత్రలో నటించగా రష్మిక మందన్న హీరోయిన్గా నటించింది.  రష్మిక "సమీరా" పాత్రకు మంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది .



అనిమల్ సినిమాలో గీతాంజలి పాత్ర ..తర్వాత పుష్ప2 సినిమాలో శ్రీవల్లి పాత్ర కి అలాంటి కామెంత్స్ దక్కించుకున్న రష్మిక ఇప్పుడు కుబేర సినిమాలో   సమీరా పాత్రకి  కూడా అలాంటి కామెంట్స్ దక్కించుకుంటుంది . దీని పట్ల రష్మిక కూడా పాజిటివ్గా స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ నోట్ షేర్ చేసింది.  అయితే ఈ సినిమాలో రష్మిక నటించిన సమీరా పాత్రకు ముందుగా హీరోయిన్ కీర్తి సురేష్ ని అనుకున్నారట శేఖర్ కమ్ముల.  అయితే ఆమె తన పెళ్లి అలాగే బాలీవుడ్ సినిమాలకు కమిట్ అయిన కాల్ షీట్స్ కారణంగా ఈ క్యారెక్టర్ ని రిజెక్ట్ చేసిందట.  ఆమె చేసిన బాలీవుడ్ సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యింది.  ఒకవేళ ఆమె ఆ సినిమా బదులు ఈ సినిమా ఒప్పుకొని ఉన్న కెరియర్ సెటిల్ అయిపోయి ఉండేది అంటున్నారు జనాలు. అంతేకాదు కీర్తు సురేష్ బేబీ జాన్ కోసం మంచి మంచి సినిమాలను మిస్ చేసుకుంది అంటూ ఓ న్యూస్ అప్పట్లో తెగ చక్కర్లు కొట్టింది. కీర్తి సురేష్ మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నింది అంటూ బాధ పడిపోతున్నారు ఫ్యాన్స్ . నిజమే రష్మిక పాత్రలో కీర్తి సురేష్ కూడా బాగా నటించి ఉండేది అంటున్నారు జనాలు..!

మరింత సమాచారం తెలుసుకోండి: