కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్, వ‌రుస హిట్స్‌తో దూసుకుపోతున్న‌ యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో రూపొందిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్ల‌ర్ `కూలీ`. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ నిర్మించిన ఈ మూవీలో శృతిహాసన్ హీరోయిన్ కాగా.. టాలీవుడ్ కింగ్ నాగార్జున, ఉపేంద్ర, సత్యరాజ్ తదితరులు ఇతర ముఖ్యమైన పాత్రల‌ను పోషించారు. ఇటీవలే షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న కూలీ ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది.


ఇప్పటికే ఈ చిత్రంపై అంచనాలు తారా స్థాయిలో ఏర్పడ్డాయి. బిజినెస్ కూడా భారీ లెవ‌ల్ లో జరుగుతోంది. అయితే ఇలాంటి తరుణంలో మేకర్స్ కూలీ టైటిల్ లో మార్పుకు రెడీ అయ్యారు. మొద‌ట అన్ని భాషలకు సెట్ అయ్యే విధంగా కూలీ అని టైటిల్ పెట్టారు. కానీ హిందీలో ఇప్పుడు కొత్త టైటిల్ తో సినిమాను రిలీజ్ చేయబోతున్నార‌ట‌. హిందీలో ఇప్పటికే అమితాబ్ బచ్చన్ నటించిన `కూలీ` అనే క్లాసిక్ హిట్ ఉంది. అలాగే 2020లో వరుణ్ ధావ‌న్ హీరోగా చేసిన‌ `కూలీ నెంబర్ 1` అనే సినిమా కూడా విడుదలయింది.


హిందీలో ఒకే టైటిల్ తో ఇప్పటికే రెండు సినిమాలు రావడంతో రజినీకాంత్ కూలీ చిత్రాన్ని `మజాదూర్` అనే కొత్త పేరుతో రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నట్టు తమిళ సినీ వ‌ర్గాల్లో బ‌లంగా ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే ఈ విషయంపై రజిని ఫ్యాన్స్ ఫుల్ డిసప్పాయింట్ అయ్యారు. ఎందుకంటే కూలీ టైటిల్ ఆల్రెడీ జనాల్లోకి వెళ్లిపోయింది. ఫ్యాన్స్ ఆ టైటిల్ బాగా అల‌వాటు ప‌డిపోయారు. ఇలాంటి టైంలో టైటిల్ ఛేంజ్ అంటే ఫ్యాన్స్ జీర్ణించుకోలేక‌పోతున్నారు. టైటిల్ మార్చ‌కుండా `రజినీ కూలీ` పేరుతో విడుదల చేయాలని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: