టాలీవుడ్ లో ఉన్న స్టార్ డైరెక్టర్స్ లో శేఖర్ కమ్ముల ఒకరు. ఫీల్ గుడ్ చిత్రాలకు కేరాఫ్ అయిన శేఖర్ కమ్ముల ఇటీవల రూటు మార్చి `కుబేర` అంటూ ఎమోషనల్ డ్రామాతో ప్రేక్షకులను పలకరించారు. కోలీవుడ్ స్టార్ ధనుష్, టాలీవుడ్ కింగ్ నాగార్జున ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం బాక్సాఫీస్ హిట్ గా నిలిచింది. దీంతో శేఖ‌ర్ క‌మ్ముల నెక్స్ట్ ఎవ‌రితో అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. ఈ క్ర‌మంలోనే న్యాచుర‌ల్ స్టార్ నాని పేరు తెర‌పైకి వ‌చ్చింది.


శేఖ‌ర్ క‌మ్ముల త‌దుప‌రి చిత్రం నానితోనే ఉండ‌బోతుంద‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో బ‌లంగా ప్ర‌చారం జ‌రుగుతోంది. కుబేర వంటి సీరియ‌స్ కంటెంట్ అనంత‌రం శేఖ‌ర్ మ‌ళ్లీ ప్ర‌శాంత‌మైన ప్రేమ‌క‌థ‌తో వ‌చ్చేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే నాని మాత్రం ఇప్ప‌ట్లో డేట్స్ ఖాళీగా లేవ‌ని చెప్పి శేఖ‌ర్ క‌మ్ములకు షాక్ ఇచ్చార‌ట‌. రీసెంట్ గా `హిట్ 3` తో స‌క్సెస్ అందుకున్న నాని.. ప్ర‌స్తుతం `ది ప్యారడైజ్` మూవీ చేస్తున్నాడు. శ్రీకాంత్ ఓదెల డైరెక్ట్ చేస్తున్న ఈ రా అండ్ ర‌స్ట‌క్ ఫిల్మ్ వ‌చ్చే ఏడాది మార్చి 26న పాన్ ఇండియా స్థాయిలో విడుద‌ల కాబోతుంది.


ప్యార‌డైజ్ త‌ర్వాత సుజిత్ డైరెక్షన్ లో ఓ సినిమా చేసేందుకు నాని గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. యాక్షన్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెర‌కెక్క‌నున్న ఈ చిత్రాన్ని డివివి దానయ్య నిర్మించ‌నున్నారు. ఈ రెండు ప్రాజెక్ట్స్ ఫినిష్ కావ‌డానికి ఏడాదిన్న‌ర స‌మ‌యం అయినా ప‌డుతుంది. మ‌రి కుబేర వంటి హిట్ ప‌డ్డాక కూడా నాని కోసం శేఖర్ క‌మ్ముల అంత కాలం వెయిట్ చేస్తాడా? లేక మ‌రొక హీరోతో ముందుకు వెళ్తారా? అన్న‌ది చూడాలి.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: