
ఇక ఈ సినిమాకి ఆర్ఎక్స్ 100 ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్నట్టు తెలుస్తుంది . జయకృష్ణ ఎంట్రీ విషయంలో మహేష్ కూడా ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంది .. తండ్రి లేని లోటును తీర్చాల్సిన బాధ్యత మహేష్ పై ఉన్న క్రమంలో జయకృష్ణకు సంబంధించి మహేష్ అన్ని వ్యవహారాలు చూసుకోవాల్సి ఉంటుంది .. అలాగే కోలీవుడ్ నుంచి మక్కల్ సెల్వన్ విజయ సేతుపతి కొడుకు సూర్యసేతుపతి కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు .. ఫినిక్స్ చిత్రంతో హీరోగా అడుగుపెట్టబోతున్నాడు . స్టంట్ డైరెక్టర్ అనల్ అరుసు ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు . ఇప్పటికీ అన్ని పనులు పూర్తి చేసుకుని ఈ సినిమా జూలైలో రిలీజ్ కు రాబోతుంది .. అలాగే దళపతి విజయ్ కొడుకు జాసన్ సంజయ్ కూడా ఇండస్ట్రీలో అడుగుపెడుతున్నాడు .. అయితే జాసన్ హీరోగా కాకుండా డైరెక్టర్గా లాంచ్ అవుతున్నాడు .. విజయ్ నటవరసత్వాన్ని కొనసాగిస్తాడు ? అనుకుంటే తండ్రి ప్రయాణానికి భిన్నంగా జాసన్ జర్నీ మొదలు కాబోతుంది .
పెద్ద డైరెక్టర్ అయిన తర్వాత తండ్రిని డైరెక్ట్ చేసే అవకాశం ఉంటుంది .. ఇలా క్రియేటివ్ గా వెళ్లాలని ఈ శాఖను అతను ఎంచుకున్నట్లు తెలుస్తుంది .. అలాగే నందమూరి హరికృష్ణ కొడుకు జానకిరామ్ తనయుడు నేటితరం ఎన్టీఆర్ కూడా చిత్ర పరిశ్రమలో అడుగుపెడుతున్నాడు .. వైవిఎస్ చౌదరి ఈ బాధ్యతను తీసుకున్నాడు .. ఇప్పటికే ఈ సినిమా పూజ కార్యక్రమాలు పూర్తిచేసుకుని షూటింగ్ కు వెలబోతుంది .. అలాగే మలయాళం నుంచి మోహన్లాల్ కూతురువిస్మయ మోహన్‌లాల్ తుడక్కం సినిమాతో నటిగా ఎంట్రీ ఇస్తుంది .. ఇక ఈ సినిమా నీ మోహన్‌లాల్ తన సొంత నిర్మాణ సంస్థ ఆశీర్వాద్ సినిమాపై నిర్మించారు .. 2018 సినిమా దర్శకుడు జూడ్ ఆంథోనీ జోసెఫ్ దీనికి దర్శకత్వం వహిస్తున్నాడు .. తుడక్కం ఓ పీరియాడిక్ యాక్షన్ థ్రీల్లర్గా ఇటీవలే మొదలైంది .. ఇలా మన చిత్ర పరిశ్రమలో ఉన్న కొంత మంది వారసుల ఎంట్రీ తో ఇండస్ట్రీకి కొత్త కల రాబోతుంది అనేది మాత్రం అర్థమవుతుంది ..