గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ది అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ కి బుచ్చిబాబు సనా దర్శకత్వం వహిస్తూ ఉండగా ... జాన్వి కపూర్మూవీ లో హీరోయిన్గా నటిస్తోంది. శివరాజ్ కుమార్ , జగపతి బాబు , దివ్యాంధు ఈ మూవీ లో కీలక పాత్రలలో కనిపించనుండగా ... ఏ ఆర్ రెహమాన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. వృద్ధి సినిమాస్ , మైత్రి సంస్థ , సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ల వారు సంయుక్తంగా ఈ మూవీ ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే సంవత్సరం మార్చి 27 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు.

సినిమా షూటింగ్ చాలా వరకు ఇప్పటికే పూర్తి అయినట్లు తెలుస్తోంది. ఈ మూవీ తర్వాత చరణ్ , సుకుమార్ దర్శకత్వంలో మూవీ చేయబోతున్నాడు. ఈ మూవీ చరణ్ కెరియర్లో 17 వ మూవీగా రూపొందనుంది. దానితో ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా మేకర్స్ కొన్ని రోజుల క్రితమే ఆర్సి 17 అనే వర్కింగ్ టైటిల్తో ఇచ్చేశారు. ఇకపోతే ప్రస్తుతం సుకుమార్మూవీ కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా సుకుమార్ "ఆర్సి 17" మూవీ లో చరణ్ కు జోడిగా హీరోయిన్ ని ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది.

మూవీ లో చరణ్ కు జోడిగా రుక్మిణి వాసంతి నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఈమె సప్త సాగరాలు దాటి సినిమాతో మంచి గుర్తింపును సంపాదించుకుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ తారక్ , ప్రశాంత్ నీల్ కాంబోలో రూపొందుతున్న సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. తాజాగా ఈ బ్యూటీ చరణ్ , సుకుమార్ కాంబోలో రూపొందబోయే సినిమాలో కూడా హీరోయిన్గా ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. మరి ఈ వార్త ఎంత వరకు నిజం అనేది తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: