ఈ మధ్యకాలంలో సినీ స్టార్స్ ఎలా హై రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా కొంతమంది స్టార్ట్స్ సినిమా బడ్జెట్లో సగం కి పైగా రీమేక్ అని తీసేసుకుంటున్నారు . 100 కోట్లు 150 కోట్లు ప్లస్ 150 కోట్లు తీసుకొని కూడా సినిమాకి మంచి కలెక్షన్స్ వచ్చే ఏరియాలో వాటాలో ఇలా బీభత్సంగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. అయితే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఓ న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. బాలీవుడ్ ఇండస్ట్రీలో భారీ బడ్జెట్ తో అత్యంత హై ఎక్స్పెక్టేషన్స్తో తెరకెక్క్కుతున్న రామాయణ సినిమాకి సంబంధించి ఒక్కొక్క స్టార్ తీసుకునే రెమ్యూనరేషన్ డీటెయిల్స్ బయటపడ్డాయి.
 

అందుతున్న సమాచారం ప్రకారం .. ఈ సినిమా బడ్జెట్ మొత్తం 1600 కోట్లు అంటూ తెలుస్తుంది. ఈ సినిమాలో నటిస్తున్న వారి రెమ్యూనిరేషన్ ఓ రేంజ్ లో ఉంటాయని చర్చ కూడా సాగుతుంది . ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో ఇదే న్యూస్ వైరల్ గా మారింది. ఈ సినిమాలో హీరోగా నటిస్తున్న రణబీర్ కపూర్  మూవీ కోసం ఏకంగా 170 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నారట . ఇది రెండు భాగాలుగా కలిపి తీసుకుంటున్నట్లు తెలుస్తుంది.  ఇక సాయి పల్లవి సినిమా కోసం 15 కోట్లు తీసుకుంటుందట. ఇలా సినిమాలో లీడ్ గా నటిస్తున్న వీరిద్దరూ భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకోవడం సినీ వర్గాలలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.

 

ఇక ఈ సినిమాలో రావణుడి పాత్రలో నటిస్తున్న యాష్ ఈ సినిమా కోసం కేవలం 7 కోట్లు మాత్రమే తీసుకున్నారట . లక్ష్మణుడిగా రవి దుబే , హనుమాన్ సన్నీ డియోల్ మూడు కోట్లు తీసుకున్నారట . దీపావళి సందర్భంగా ఈ సినిమా మొదటి భాగం 2026లో రిలీజ్ కాబోతుంది . ఇక 2027 దీపావళికి రెండో భాగం రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.  ఇప్పటివరకు సినీ ఇండస్ట్రీలో హీరోలలో హైయెస్ట్ రెమ్యూనరేషన్ అంటే ప్రభాస్ 150 కోట్లు .. హీరోయిన్లు అంటే నయనతార 12 కోట్లు .. ఆ ఇద్దరి రికార్డ్స్ బ్రేక్ చేశారు రన్బీర్ కపూర్ - సాయి పల్లవి. దీంతో ఈ సినిమాల్లో వీళ్ల పర్ ఫామెన్స్ ఎలా ఉండబోతుంది అనేది అర్ధం అవుతుంది..!

మరింత సమాచారం తెలుసుకోండి: