మలయాళ సినీ ఇండస్ట్రీలో అతి తక్కువ సమయంలోనే భారీ పాపులరాటీ సంపాదించిన నటుడు సౌభిన్ షాహీర్ కూడా ఒకరు. 2015లో విడుదలైన ప్రేమమ్ చిత్రం ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత షాహిర్ పాన్ ఇండియా స్థాయిలో పేరు సంపాదించిన ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ పేరు సంపాదించారు.2024 లో విడుదలైన మంజుమ్మల్ బాయ్స్ చిత్రంలో కీలకమైన పాత్రలో నటించి దేశవ్యాప్తంగా పేరు సంపాదించారు. దీనివల్ల పాన్ ఇండియా చిత్రాలలో కూడా నటించే అవకాశాలను అందుకున్నారు సౌభిన్ షాహీర్.

ప్రస్తుతం రజనీకాంత్ నటించిన కూలి చిత్రంలో కూడా నటిస్తూ ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలోనే ఇతడిని అరెస్టు చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. మంజుమ్మల్  బాయ్స్ సినిమా నిర్మాణానికి సంబంధించి అలాగే మనీ లాండరింగ్లో ఫిర్యాదు చేయడంతో నటుడు సౌభిన్ షాహీర్ తో సహా మరొక ముగ్గురు వ్యక్తులపైన అరెస్టు వారంటీ జారీ చేసినట్లు తెలుస్తోంది. మంజుమ్మల్  బాయ్స్ సినిమాలో వచ్చే లాభాలలో 40% ఇస్తామంటూ మోసం చేశారని కేవలం 7 కోట్లు మాత్రమే ఇచ్చారంటూ సిరాజ్ వ్యక్తి కోర్టులో ఫిర్యాదు చేశారు.


ఈ ఫిర్యాదు ఆధారంగానే మలయాళ నటుడు సౌభిన్ షాహీర్ పైన మరో ముగ్గురిని అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ పిటిషన్ జరిగిన వెంటనే ముగ్గురు ముందస్తు బెయిల్ కోసం ఎర్నాకులం కోర్టులో పిటిషన్లను కూడా దాఖలు చేసినట్లు తెలుస్తోంది. ఈ బెయిల్ పిటీషన్ విచారణ చేసిన అనంతరం న్యాయస్థానం ముందస్తు బెయిల్ మంజూరు చేయగా. నటుడు సౌభిన్ షాహీర్ తో సహా ముగ్గురు బెయిల్ మీద బయటకు వచ్చారు. అయితే నటుడు సౌబిన్ అరెస్టు మాత్రం మలయాళ ఇండస్ట్రీలోనే ఒక సంచలనంగా మారుతున్నది. మరి ఇక మీదట ఇలాంటి వివాదాలకు సైతం పుల్ స్టాప్ పెట్టే విధంగా నిర్ణయాలు తీసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: