అయితే మోహన్ బాబు స్కూల్ లో చదువుకుని.. ఆ తర్వాత తమిళ్, తెలుగు భాషల్లో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన ఓ బ్యూటీ ఒకరున్నారు. ఈ విషయాన్ని గతంలో ఒక ఇంటర్వ్యూలో మోహన్ బాబు స్వయంగా వెల్లడించారు. తమ విద్యాసంస్థలో చదువుకున్న ఒక అమ్మాయి ఇప్పుడు తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా రాణిస్తోందని ఆయన తెలిపారు. కాకపోతే గుర్తులేకపోవడం వల్ల ఆమె పేరును మోహన్ బాబు చెప్పలేకపోయారు.
అయితే ఆమె మరెవరో కాదు ఐశ్వర్య రాజేష్. ఈ భామ మన తెలుగమ్మాయే. ఐశ్వర్య తండ్రి రాజేశ్ తెలుగులో 50కి పైగా చిత్రాలలో నటించిన నటుడు. ఆమె తాత అమరనాథ్ కూడా నటుడే. అలాగే 500కి పైగా సినిమాల్లో యాక్ట్ చేసిన లేడీ కమెడియన్ శ్రీలక్ష్మీ ఐశ్వర్యకు స్వయాన మేనత్త. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయిన ఐశ్వర్య రాజేష్.. తిరుపతిలోని శ్రీ విద్యానికేతన్ స్కూల్ లో తన స్కూలింగ్ ను పూర్తి చేసింది. ఆపై చెన్నై వెళ్లి డిగ్రీ పట్టా అందుకుంది.ఇక ఒక తమిళ టీవీ రియాలిటీ షోలో తన కెరీర్ ను ప్రారంభించిన ఐశ్వర్య.. మెల్లగా వెండితెరపై అడుగుపెట్టింది. డస్కీ స్కిన్ టోన్ కారణంగా మొదట్లో ఎన్నో తిరస్కరనలు ఎదుర్కొంది. అయిన కూడా వెనక్కి తగ్గకుండా స్ట్రాంగ్ గా నిలబడ్డ ఐశ్వర్య.. అనతి కాలంలోనే కోలీవుడ్ లో మంచి నటిగా గుర్తింపు సంపాదించుకుంది. ఆపై తెలుగు, మలయాళ, కన్నడ భాషల్లోకి కూడా ప్రవేశించి తన ప్రతిభతో అవకాశాలు దక్కించుకుంటూ బిజీ యాక్ట్రస్ గా సత్తా చాటుతోంది. తెలుగులో ఇటీవల `సంక్రాంతికి వస్తున్నాం` మూవీతో బిగ్ హిట్ కొట్టింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి