ఇప్పుడు ఎక్కడ చూసినా సరే "మొనికా.. మై డియర్ మోనిక" అంటూ ఓ సాంగ్ తెగ ట్రెండ్ అవుతుంది. ఈ సాంగ్ బాగా వైరల్ గా మారింది. సోషల్ మీడియాలో ఈ పాట మారు మ్రోగిపోతుంది.  రజనీకాంత్ నటిస్తున్న కూలీ సినిమాలోని స్పెషల్ సాంగ్ ఈ మోనిక ..మై డియర్ మొనిక . హైలెట్ ఏంటంటే ఈ సాంగ్లో అందాల ముద్దుగుమ్మ పూజా హెగ్డే చిందులు వేసింది. కాగా రీసెంట్గా రిలీజ్ అయిన  ఈ పాట అభిమానులను  ఓ రేంజ్ లో ఎంటర్టైన్ చేస్తుంది . ఏ ఫంక్షన్ అయినా ఏ ఈవెంట్ అయినా ఇప్పుడు "మొనిక మై డియర్ మొనిక " పాట ఉండాల్సిందే . ఈ పాటలో రజనీకాంత్ కాకుండా వేరే ఒక నటుడు బాగా హైలెట్ అయ్యాడు .


సౌభిన్ షాహీర్ ..అతని పేరు . ఆయన డాన్స్ అందరి దృష్టిని ఆకర్షించింది . ఆయన లో ఇంత మంచి డాన్సర్ ఉన్నాడా..? అంటూ ఆయన అభిమానులే ఆశ్చర్యపోతున్నారు.  అంతలా సౌభిన్ డ్యాన్స్ చేశారు . కాగా అసలు సౌభిన్ ఎవరు.. ఇంత టాలెంట్ ఉన్న ఆయన ఎందుకు హీరో కాలేకపోయాడు అనే విషయాలు ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి . తెలుగు ప్రేక్షకులకు మలయాళ నటుడు సౌభిన్ బాగా సుపరిచితుడే . రోమాంచం, మంజులం బాయ్స్ తదితర డబ్బింగ్ చిత్రాలలో ఇక్కడ ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచేసుకున్నారు .



మన ఇండస్ట్రీలో టైర్ 2   హీరోకి ఎంత పాపులారిటీ ఉంటుందో అంతే పాపులారిటీ ఈ సౌభిన్  కి కూడా ఉంటుంది.  కేరళలో పుట్టి పెరిగిన ఆయన సినీ నేపథ్య కుటుంబం కలవారు . ఆయన తండ్రి బాబు షాహీర్ అసిస్టెంట్ డైరెక్టర్ ప్రొడక్షన్ కంట్రోలర్.  1990లో వచ్చిన "వియత్నం కాలనీ" వంటి మలయాళ సినిమాలలో బాల నటుడిగా సందడి చేసి ఆ తర్వాత ఎన్నెన్నో పాత్రలో నటించి మెప్పించాడు. మరీ ముఖ్యంగా అందరితో బాగా క్లోజ్ గా ఉంటాడు. నమ్మకానికి నిజాయితీకి మరో మారుపేరు అంటూ ఆయనతో వర్క్ చేసిన వాళ్ళు చెబుతూ ఉంటారు. ఈ దశాబ్దంలో 100 గ్రేటెస్ట్ యాక్టర్స్ లలో సౌభిన్ కూడా ఒకరు అని ఓ ఎంటర్టైన్మెంట్ పోర్టల్ పేర్కొనడం గమనార్హం.



మమ్ముట్టి - మోహన్ లాల్  నుంచి ఫహద్ ఫజిల్ వరకు మలయాళ హీరోల చిత్రాలలో కీలక రూల్ ప్లే చేశాడు . ఇప్పటివరకు ఆయన ఎక్కడా కూడా డ్యాన్స్ చేసిన మూమెంట్స్ లేవు. ఫర్ ద ఫస్ట్ టైం ఈ సినిమాలోనే  ఈ రేంజ్ లో డాన్స్ చేశారు . కాళ్ళు చేతులు ఊపడం  తప్పిస్తే మిగతా సినిమాలలో పెద్దగా డ్యాన్స్ సీన్స్ లేవు.నటన పరంగానే ముందుకు వెళ్లాడు.  కానీ మలయాళ నటుడు సౌభిన్ లో ఒక మంచి డాన్సర్ ఉన్నారు అన్న విషయాన్ని లోకేష్ కనగరాజు గుర్తించాడు అంటూ కూలి దర్శకుడు పై ప్రశంసలు కురిపిస్తున్నారు . ఈ సినిమా ఆగస్టు 14వ తేదీ గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది..!

మరింత సమాచారం తెలుసుకోండి: