ఇండియా వ్యాప్తంగా సూపర్ సాలిడ్ క్రేజ్ కలిగిన నటీమణులలో పూజ హెగ్డే ఒకరు. ఈమె నాగ చైతన్య హీరోగా రూపొందిన ఒక లైలా కోసం అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ మూవీ మామూలు విజయం అందుకున్న ఈ సినిమాలో ఈమె తన అందాలతో , నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈమెకి ఈ మూవీ ద్వారా మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత ఈమె టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలలో నటించి చాలా తక్కువ కాలంలోనే తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది. ఈ మధ్య కాలంలో ఈమె తెలుగులో నటించిన చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి.

ప్రస్తుతం ఈమె చేతిలో తెలుగు సినిమాలు కూడా ఏమీ లేవు. ఈమె ఎక్కువ శాతం తమిళ సినిమాలలో నటిస్తూ కెరియర్ను ముందుకు సాగిస్తోంది. కొంత కాలం క్రితమే ఈ బ్యూటీ తమిళనాడు సూర్య హీరోగా రూపొందిన రైట్రో అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. ఈ మూవీ కూడా ఈమెకు నిరాశనే మిగిల్చింది. తాజాగా ఈ బ్యూటీ రజనీ కాంత్ హీరోగా లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో రూపొందిన కూలీ సినిమాలో స్పెషల్ సాంగ్ లో నటించింది. ఈ మూవీ ఆగస్టు 14 వ తేదీన విడుదల కానుంది. ఈ మధ్య కాలంలో  ఈమె నటించిన సినిమాలు వరుసగా బోల్తా కొడుతూ వస్తుండడంతో కూలీ సినిమాలో ఈమె నటించడంతో ఈ మూవీ పరిస్థితి ఏమవుతుందో అని కొంత మంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కానీ ఓ సెంటిమెంట్ వర్కౌట్ అయితే మాత్రం కూలీ మూవీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంటుంది అని మరి కొంత మంది అభిప్రాయ పడుతున్నారు.

ఆ సెంటిమెంట్ ఏమిటి అనుకుంటున్నారా ..? పూజా హెగ్డే కొన్ని సంవత్సరాల క్రితం రంగస్థలం , ఎఫ్ 3 అనే సినిమాలలో స్పెషల్ సాంగ్లను చేసింది. ఈ రెండు సినిమాలు కూడా మంచి విజయాలను అందుకున్నాయి. ఇక కూలీ సినిమాలో కూడా ఈ బ్యూటీ స్పెషల్ సాంగ్ చేయడంతో ఆ మూవీల సెంటిమెంట్ కూలీ విషయంలో వర్కౌట్ అయితే  ఈ మూవీ కూడా మంచి విజయాన్ని అందుకునే అవకాశాలు ఉన్నాయి అని కొంత మంది అభిప్రాయ పడుతున్నారు. మరి కూలీ మూవీ ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: