సౌత్ ఫిల్మ్‌ ఇండస్ట్రీలో ఉన్న మల్టీ టాలెంటెడ్ పర్సన్స్ లో ఎస్ జె సూర్య ఒకరు. దర్శకుడిగా, నటుడిగా, నిర్మాతగా, స్క్రీన్ రైటర్ గా, గాయకుడిగా సినీ రంగంలో సూర్య విశేషమైన గుర్తింపు సంపాదించుకున్నారు. ఈయన అసలు పేరు సెల్వరాజ్ జస్టిన్ పాండియన్. హీరో అవ్వాలనే ఇండస్ట్రీలోకి వచ్చినప్పటికీ.. ఆర్థిక పరిస్థితులు మరియు ఇతర కారణాల వల్ల ఆయ‌న డైరెక్షన్ వైపు అడుగులు వేశారు. 1999లో `వాలీ` మూవీతో ఎస్ జె సూర్య మెగా ఫోన్ పట్టారు. అజిత్‌ హీరోగా నటించిన ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ కావడంతో ఎస్ జె సూర్యకు మంచి పేరు వచ్చింది.


ఆ మ‌రుస‌టి ఏడాది `ఖుషి` మూవీతో తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు, తమిళంలో విజయ్ ద‌ళ‌ప‌తికి బ్లాక్ బస్టర్ అందించారు. స్వీయ దర్శకత్వంలో ఎస్ జె సూర్య కొన్ని సినిమాల్లో హీరోగా కూడా చేశారు. కానీ అవి అంతగా వర్కౌట్ కాలేదు. కొంతకాలానికి సూర్య విల‌న్ క్యారెక్ట‌ర్స్‌ వైపు మొగ్గు చూపారు. 2017లో `స్పైడర్` మూవీలో సైకోగా నటించి అందరిని భయపెట్టారు. సీరియస్ యాక్టింగ్‌తో ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. విలన్‌గా అవార్డు విన్నింగ్ పెర్ఫార్మెన్స్ ఇస్తూ స్టార్ హీరోల చిత్రాల‌కు మోస్ట్ వాంటెడ్‌గా మారారు.


ప్ర‌స్తుతం `లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ`, `ఇండియన్ 3`, `సర్దార్ 2` వంటి చిత్రాల్లో ఎస్ జె సూర్య యాక్ట్ చేస్తున్నారు. అదే ప‌దేళ్ల విరామం త‌ర్వాత ఆయ‌న మ‌ళ్లీ మెగా ఫోన్ ప‌ట్టారు. స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో హీరోగా `కిల్లర్` అనే మూవీ చేస్తున్నారు. ప్రొఫెష‌న్ గురించి ప‌క్క‌న పెడితే.. ఎస్ జె సూర్య ఏజ్ 57. బ‌ట్ స్టిల్ సింగిల్ గానే ఉన్నాయి. ఆరు ప‌దుల వ‌య‌సుకు చేర‌వ‌వుతున్న ఎస్ జె సూర్య ఇంత‌వ‌ర‌కు పెళ్లెందుకు చేసుకోలేదు అన్న సందేహం చాలా మందిలో ఉంది.


ఓ ఇంట‌ర్వ్యూలో ఎస్ జె సూర్య పెళ్లి మ్యాట‌ర్ పై రియాక్ట్ అయ్యారు. పెళ్లి కన్నా ఎక్కువగా త‌న‌ను ఆకర్షించింది సినిమానే. తాను పూర్తిగా సినిమాల్లో బిజీగా ఉండ‌టం వ‌ల్ల‌ పెళ్లి గురించి ఆలోచించే సమయం దొరకలేదు. కెరీర్‌ను స్థిరం చేసుకోవాలన్న కోరిక త‌న‌ను వివాహం నుండి దూరంగా ఉంచిందని ఎస్ జె సూర్య చెప్పారు. అయితే మ‌రో వాద‌న కూడా ఉంది. ఓసారి ఎస్ జె సూర్య‌ ప్రేమలో విఫలం అయ్యార‌ని, ఆ బాధతోనే పెళ్లిపై ఆయ‌న‌ ఆసక్తి కోల్పోయార‌ని గ‌తంలో క‌థ‌నాలు వెలువ‌డ్డాయి. ఏదేమైనా వెండితెర ఖుషి, ఇసై వంటి ప్రేమ కథల్ని తీసిన ఎస్ జె సూర్య నిజ జీవితంలో ప్రేమ, పెళ్లికి దూరంగా ఉండ‌టం నిజంగా విడ్డూర‌మే.

మరింత సమాచారం తెలుసుకోండి: