
రీసెంట్ గానే నితిన్ నటించిన "తమ్ముడు" సినిమాలో నటించిన వర్ష బొల్లమ్మ 2015వ సంవత్సరంలో "సుతరన్" అనే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది . ఆ తర్వాత అడపాదడపా అవకాశాలు అందుకుంటూ ఇండస్ట్రీలో తన స్థానాన్ని కంటిన్యూ చేస్తూ వచ్చింది. మరి ముఖ్యంగా "వర్ష బొల్లమ్మ" చెప్పే డైలాగ్స్ అభిమానులను బాగా ఆకట్టుకుంటూ ఉంటాయి . వర్ష బొల్లమ్మ ఎక్స్ ప్రెషన్స్ క్వీన్ అంటూ జనాలు ముద్దుగా పిలుచుకుంటూ ఉంటారు. జాను , మిడిల్ క్లాస్ మెలోడీస్, పుష్పకవిమానం , స్వాతిముత్యం, ఊరు పేరు బైరవకోన ఇలాంటి సినిమాలలో తనదైన స్టైల్ లో నటించి తన నటన తో అందర్ని మెప్పించింది.
కానీ క్రేజీ హిట్ మాత్రం కొట్టలేకపోయింది. రీసెంట్ గా వచ్చిన తమ్ముడు సినిమాతో తన కెరియర్ మారిపోతుంది అనుకుంది. కానీ అది డిజాస్టర్ కావడంతో అమ్మడు ఖాతాలో మరొక ఫ్లాప్ పడిన్నట్లు అయ్యింది. ఇదే మూమెంట్లో హీరోయిన్ వర్ష బొల్లమ్మ తన ఫ్రెండ్ స్టార్ట్ చేసిన "మై ఫ్రెండ్ చైనీస్ ఫాస్ట్ ఫుడ్" ని తన సోషల్ మీడియా ద్వారా ప్రమోట్ చేసింది. అసలు విషయం తెలియక చాలామంది ఈ బిజినెస్ స్టార్ట్ చేసింది వర్ష బొల్లమ్మ అని అనుకుని ఆమె పేరుని వైరల్ చేస్తున్నారు . అసలు నిజం ఏంటంటే ఆమె నడపడం లేదు ఆమె తన ఫ్రెండ్ నడిపిస్తున్న వ్యాపారాన్ని ప్రమోట్ చేసింది అంతే..!!