
1975 జూలై 25న బాపు , రమణ ఇద్దరు కలిసి వేసిన ముత్యాలముగ్గును చూడడానికి జనం పరుగులు తీశారు . శ్రీరామ చిత్రపతాకం పై మల్లాది వెంకట లక్ష్మీనరసింహ ఈ సినిమాను నిర్మించారు. ఈ మూవీ ఘన విజయం సాధించింది . ఈ సినిమాలో సంగీత , శ్రీధర్ , కాంతారావు , ముక్కామల , అల్లు రామలింగయ్య , సాక్షి రంగారావు , నూతన ప్రసాద్ . సూర్యకాంతం , జయమాలిని ,హల్లం , మాడా నటించారు . ఈ మూవీలో తమదైన వాచకంతో ఆకట్టుకున్నారు రావు గోపాలరావు . రావు గోపాల్ రావు నటించిన కాంట్రాక్టర్ పాత్ర ఈనాటికీ కళా పోషణ తెలిసిన వారి మదిలో చిందులు వేస్తూనే ఉంటుంది.
అంతేకాదు రావు గోపాలరావు 30 ఏళ్లు కెరియర్ కి ఏ విధమైన తిరుగు లేకుండా చేసి పెట్టింది ఈ ముత్యాలముగ్గు సినిమా . మంచి సాహిత్యం .. మంచి దృశ్యం.. మంచి సంగీతం కలగలిస్తేనే ఈ ముత్యాలముగ్గు అనినిరూపించింది . స్త్రీని అవమానించడం రామాయణ కాలం నుంచి ఉంది . నిర్ధారణను లేకుండా ఆమెను కారుడడవులకు సాగనంపడ, నేటికీ సమాజంలో కొనసాగుతూనే ఉంది . అనుమానించడం మగవాడి వంతు ..శిక్ష వేయడం అతని అధికారం కానీ అనుమానించిన రాముడే మచ్చను మిగులుచుకున్నాడు తప్ప సీత కాదు . ముత్యాలముగ్గులో భర్త మూర్ఖుడిగా మిగిలాడు తప్ప భార్య కాదు .
నాటి నుండి నేటి వరకు ఈ శీలం చుట్టూ సాగి ఉద్వేగాలను పట్టుకోవడం వల్లే ముత్యాలముగ్గు విజయం సాధించింది అని చెప్పుకోవడంలో సందేహమే లేదు. అప్పట్లో ఈ సినిమా ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నింది. మరీ ముఖ్యంగా ఎన్టీ రామారావు గారు ఈ సినిమాని చూసి సంగీత , శ్రీధర్ల మధ్య మొదటి రాత్రి సన్నివేశాలను ప్రస్తావిస్తూ "మా పెళ్లి రోజులు గుర్తొచ్చాయి బ్రదర్ "అంటూ ముల్లపూడి తో సరదాగా అన్నారట. ముత్యాలముగ్గు లాంటి సినిమా పదేపదే సంభవించవు. సంభవించినవి కలికాలం నిలుచుండిపోతాయి అంటూ చాలామంది చెప్పుకొచ్చారు .
ఇన్నాళ్ల తర్వాత కూడా మనం ముత్యాలముగ్గు గురించి మాట్లాడుకుంటున్నామంటే ఆ సినిమా కథ , కంటెంట్ ఏ విధంగా డైరెక్ట్ చేశారు అనేది ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు . ఆ సినిమాలోని డైలాగ్స్ ఇప్పటికీ అడపదడపా మనం పలు సందర్భాలలో వాడుతూనే ఉంటాం . యెప్పుడు ఆ యెధవ బిగినెసేనా.. మడిసన్నాక కూసింత కళా పోసన ఉండాలి.. ఉత్తినే తిని తొంగుంటే మనిసికి గొడ్డుకు తేడా ఏటిఉంటాదీ.. చరిత్ర సరిపెత్తే సెరిపోదు.. చింపితే సిరిగిపోదు ..వాడికి స్త్రీ జాతి మీద నమ్మకం పోయింది. నాకు మనుషుల మీద నమ్మకం పోయింది ..సిఫారసులతో కాపురాలు అక్కబడవు గురు ..సూర్యుడు నెత్తుటి గడ్డలా లేడు..ఈ డైలాగ్స్ అన్ని ముత్యాల ముగ్గు సినిమాలోనివే. ఇలాంటి సినిమా ఇక రాదు..రాబోదు..అని చెప్పుకోవడంలో సందేహం లేదు..!!