సినిమా ఇండస్ట్రీ లో ఏదైనా సినిమా ప్రారంభం అయ్యాక ఆ మూవీ షూటింగ్ అదిరిపోయే రేంజ్ స్పీడ్ లో జరుగుతూ ఉండడం, ఆ మూవీ కి సంబంధించిన అప్డేట్లు కూడా అదే రేంజ్ లో వస్తూ ఉన్నట్లయితే ఆ హీరో ఫ్యాన్స్ చాలా ఆనంద పడుతూ ఉంటారు. అలాగే సినిమాకు సంబంధించిన అప్డేట్లు స్పీడ్ గా రావడం, మూవీ షూటింగ్ కూడా అనుకున్న రేంజ్ లో జరుగుతూ వెళుతున్నట్లయితే ఆ మూవీ పై అంచనాలు కూడా ప్రేక్షకుల్లో భారీ స్థాయిలో ఏర్పడుతూ ఉంటాయి. కానీ ఏదైనా సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యాక ఆ మూవీ షూటింగ్ సజావుగా జరగకపోయినా, ఆ మూవీ కి సంబంధించి అప్డేట్లు రాకపోయినా, విడుదల తేదీ విషయంలో మేకర్స్ క్లారిటీ మెయింటైన్ చేయకపోయినా, ఆ హీరో ఫ్యాన్స్ కాస్త కంగారుbపడుతూ ఉంటారు. అలాగే ఆ సినిమాపై కాస్త అంచనాలు కూడా తగ్గే అవకాశం ఉంటుంది.

ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి కొంత కాలం క్రితం మల్లాడి వశిష్ట దర్శకత్వం లో విశ్వంభర అనే సినిమాను మొదలు పేట్టిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ ని మొదలు పెట్టాక ఈ సినిమాను ఈ సంవత్సరం సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.  ఐ చిత్ర బృందం విడుదల తేదీని ప్రకటించడంతో ఈ సినిమా ఖచ్చితంగా సంక్రాంతికి వస్తుంది అని చాలా మంది అనుకున్నారు. కానీ ఈ మూవీ సంక్రాంతికి రాలేదు. ఆ తర్వాత ఈ సినిమా ఆ తేదీన విడుదల కానుంది ..? ఈ తేదీన విడుదల కానుంది ..? అని అనేక వార్తలు వచ్చాయి.

కానీ మేకర్స్ ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. తాజాగా ఈ మూవీ దర్శకుడు అయినటువంటి మల్లాడి విశిష్ట ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఆ ఇంటర్వ్యూలో ఆయన ఈ సినిమా విడుదల తేదీ గురించి ఏమీ అనుకోవడం లేదు. మూవీ మొత్తం కంటెంట్ చూసుకొని అది బాగున్నట్లయితే సినిమా విడుదల తేదీని ప్రకటిస్తాం. మళ్లీ ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించాక ఈ మూవీ విడుదల తేదీ అసలు వాయిదా కాదు అని చెప్పుకొచ్చాడు. దానితో ఈ సినిమా విడుదల తేదీ ఎప్పుడు ఉంటుందా అనే క్లారిటీ లేకపోవడంతో మెగా ఫాన్స్ ఈ సినిమా విషయంలో  కాస్త డిసప్పాయింట్ అవుతున్నట్టు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: