
నిన్న దుల్కర్ సల్మాన్ పుట్టినరోజు కాగా ఈ సందర్భంగా ఆమె చేసిన కామెంట్లు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియా వేదికగా దుల్కర్ సల్మాన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన కళ్యాణి ప్రియదర్శన్ ప్రియమైన దుల్కర్ అంటూ సంబోధించారు. ప్రతి సంవత్సరం నీకు సోషల్ మీడియాలో కాకుండా నేరుగా పెద్ద మెసేజ్ పంపుతున్నానని ఆమె చెప్పుకొచ్చారు.
కానీ ఈ పుట్టినరోజు సందర్భంగా మాత్రం మన కలల ప్రపంచానికి సంబంధించిన గ్లిమ్ప్స్ ను అందరితో షేర్ చేసుకోబోతున్నామని అన్నారు. అందుకే ఈ పోస్ట్ చేస్తున్నానని ఆమె పేర్కొన్నారు. రియల్ లైఫ్ లో, సినీ ప్రపంచంలో నువ్వు కన్న ప్రతి కల నిజం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని ఆమె చెప్పుకొచ్చారు. గత ఐదేళ్లుగా ఏ సలహా కావాలన్నా ఫస్ట్ నీకే పోస్ట్ చేస్తున్నానని ఆమె వెల్లడించారు.
అంతలా నాకు సపోర్ట్ గా నిలబడినందుకు థాంక్స్ అని ఆమె అన్నారు. నువ్వు లేకపోయుంటే నేను ఏమైపోయేదాన్నో నాకే తెలియదని ఒక రకంగా చెప్పాలంటే నేను ఒంటరిదాన్ని కాదని ఆమె కామెంట్లు చేశారు. వరనే ఆవశ్యముంద్ అనే సినిమాలో కళ్యాణి ప్రియదర్శన్, దుల్కర్ కలిసి నటించారు. ఆ సమయంలో వీళ్లిద్దరి మధ్య స్నేహం బలపడిందని తెలుస్తోంది.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు