కొన్ని క్రేజీ కాంబినేషన్ మూవీ లకు రెమ్యూనరేషన్ ద్వారానే అత్యధిక మొత్తం బడ్జెట్ ఖర్చు అవుతూ ఉంటుంది. అందుకు ప్రధాన కారణం ఆ సినిమాలో భారీ క్రేజ్  హీరో , హీరోయిన్లు నటిస్తూ ఉండడం , అలాగే ఇతర తారాగణం కూడా భారీ క్రేజ్ ఉన్నది ఉన్నట్లయితే నటీనటులకే పెద్ద మొత్తంలో బడ్జెట్ కేటాయించాల్సి ఉంటుంది. అలాగే సినిమాకు స్టార్ట్ డైరెక్టర్ దర్శకత్వం వహించినట్లయితే ఆయనకు కూడా పెద్ద మొత్తంలో పారితోషకం ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ఇతర టెక్నీషియన్స్ కూడా సూపర్ క్రేజ్ ఉన్న వారు అయితే వారికి కూడా పెద్ద మొత్తంలో పారితోషకాలు ఇవ్వాల్సి ఉంటుంది. దీనితో సినిమా బడ్జెట్లో ఎక్కువ శాతం పారితోషకాలకే వెళుతూ ఉంటుంది. ఇది ఇలా ఉంటే తాజాగా జూనియర్ ఎన్టీఆర్ , హృతిక్ రోషన్ ప్రధాన పాత్రల్లో వార్ 2 అనే సినిమా రూపొందిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో కియార అద్వానీ హీరోయిన్గా నటించగా ... అయాన్ ముఖర్జీ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీకి గాను ఈ నలుగురికే భారీ మొత్తంలో పారితోషకాలు అందినట్లు తెలుస్తోంది. మరి ఈ నలుగురికి వార్ 2 సినిమాకు గాను భారీ స్థాయిలో పారితోషకాలు అందినట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఆ వార్త ప్రకారం వార్ 2 సినిమాకు గాను జూనియర్ ఎన్టీఆర్ , హృతిక్ రోషన్ , కియార అద్వానీ , అయాన్ ముఖర్జీ ఎంత ఎంత రెమ్యూనరేషన్లను తీసుకున్నారు అనే వివరాలను తెలుసుకుందాం.

తారక్ నటించిన మొట్ట మొదటి హిందీ సినిమా వార్ 2. ఈ సినిమాకు గాను తారక్ ఏకంగా 60 కోట్ల పారితోషకం అందుకున్నట్లు తెలుస్తోంది. ఇక బాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ కలిగిన నటులలో ఒకరు అయినటువంటి హృతిక్ రోషన్ ఈ సినిమాకు గాను 48 కోట్ల పారితోషకం అందుకున్నట్లు తెలుస్తోంది.  ఈ మూవీ లో హీరోయిన్గా నటిస్తున్న కియార అద్వానీ ఈ మూవీ కోసం 15 కోట్ల వరకు పారితోషకం పుచ్చుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాకు దర్శకత్వం వహించిన అయాన్ ముఖర్జీమూవీ కోసం ఏకంగా 32 కోట్ల పారితోషకం అందుకున్నట్లు తెలుస్తోంది. ఇలా ఈ నలుగురు కూడా ఈ సినిమా కోసం భారీ మొత్తంలో పారితోషకాలను అందుకున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: