బాహుబలి’ తరువాత రానా క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. పాన్ ఇండియా స్టార్ గా ఇమేజ్ క్రియేట్ అవ్వడంతో రానా కు చాల మంచి అవకాశాలు వస్తాయని అంతా భావించారు. అయితే ఆ స్థాయిలో రానా కు అవకాశాలు రాలేదు. దీనికితోడు రానా కు అనారోగ్య సమస్యలు ఏర్పడంతో పాటు అమెరికాలో సర్జరీ కూడ జరగడంతో రానా కు రావలసిన అవకాశాలు రాలేదు అన్న అభిప్రాయాలు ఉన్నాయి.


‘బాహుబలి’ తరువాత రానా భారీ బడ్జెట్ తో ‘హిర‌ణ్య‌క‌శ్య‌ప‌’ తీయాలని భావించాడు. భారీ బడ్జెట్ తో ఈ మూవీని తీయడానికి ఏర్పాట్లు చేయడమే కాకుండా కొన్ని వేల డ్రాయింగ్స్ వేయించి గుణశేఖర్ దర్శకుడుగా పెట్టుకుని ఈమూవీ తీయాలని రానా చాల ప్రయత్నాలు చేశాడు. ఈ మూవీకి త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రిప్ట్ రచించినట్లు వార్తలు కూడ వచ్చాయి.


గత సంవత్సరం మళ్ళీ రానామూవీ ప్రాజెక్ట్ పై దృష్టి పెట్టినట్లు వార్తలు కూడ వచ్చాయి. అయితే ఆ ప్రాజెక్ట్ ముందుకు సాగలేదు.  ఇలాంటి పరిస్థితుల మధ్య గతవారం విడుదలైన కన్నడ డబ్బింగ్ సినిమా ‘మహావతార నరసింహ’ ఎవరు ఊహించని ఘనవిజయాన్ని అందుకుంది. గతవారం భారీ అంచనాలతో విడుదలైన ‘హరి హర వీరమల్లు’ మ్యానియాను తట్టుకుని ఈమూవీ ఘన విజయం సాధించడమే కాకుండా ఆర్డినరీ డేస్ లో కూడ ఈమవవీకి వస్తున్న కలక్షన్స్ కూడ టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. అంతేకాదు ఈమూవీని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ విడుదల చేయడంతో  అరవింద్ కు జాక్ పాట్ తగిలింది అన్న కామెంట్స్ కూడవస్తున్నాయి.


గతంలో అరవింద్ ‘కాంతారా’ ను తెలుగులోకి డబ్ చేసి కోట్లు గణించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ మూవీ ఘన విజయం సాధించడంతో అరవింద్ కు ఈ మూవీ కోట్ల లాభాలు తెచ్చిపెట్టడం ఖాయం అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీనితో అరవింద్ వ్యాపార అంచనాల పై మరికొందరు ప్రశంసలు కురిపిస్తున్నారు..  


 


మరింత సమాచారం తెలుసుకోండి: